Brahmamudi serial today Episode: కావ్య రూంలో ఫోటోలు అంటిస్తుంటే.. ఇంద్రాదేవి వచ్చి నా మనవడు ఎందుకు అలా చేస్తున్నాడో తెలుసుకోమంటే.. ఈ పనేంటి అని అడుగుతుంది. ఇవి చూసైనా ఆయన మనసు మారుతుందేమోనని పెడుతున్నాను అంటుంది కావ్య. ఏమో మీ జనరేషన్ వాళ్లు అసలు అర్థం కారు.. సరే ఏదో ఒకటి చేసి నిజం తెలుసుకో అని చెప్తుంది. ఇంతలో రాజ్, కళ్యాణ్ వస్తుంటే.. అమ్మమ్మ ఆయన వస్తున్నారు మీరు వెళ్లండి అని చెప్తుంది. ఇంద్రాదేవి వెళ్లిపోతుంది. రాజ్, కళ్యాణ్ రూంలోకి వస్తారు. రాజ్ ఏంటిది అని అడుగుతాడు. దీంతో కావ్య అప్పుడే మర్చిపోయారా..? అని అడుగుతుంది. గుర్తుంది కానీ ఇక్కడ ఎందుకు అతికిస్తున్నావు అని అడుగుతున్నా అంటాడు రాజ్.
దీంతో ఏం చేద్దాం అంతా నా కర్మ కొంతమంది ఇచ్చిన మాటని చేసిన వాగ్దానాలను మర్చిపోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు కనీసం వీటిని చూసైనా మార్పు వస్తుందని చిన్న ఆశ.. ఏంటి కవి గారు అలా చూస్తున్నారు.. ఓ అర్థమైంది.. ఇలాంటి పనులు మగవాళ్లు చేయాలి.. నేను చేస్తున్నాను.. ఏంటా అనా..? ఏం చేద్దాం చెప్పండి కడుపుతో ఉన్నాను కదా..? కాళ్లు కింద పెట్టకుండా చూసుకునే మొగుడు వస్తాడనుకున్నా కానీ చెప్పకుండానే హాస్పిటల్‌కు తీసుకెళ్లి అబార్షన్ చేయించేవాడు దొరికాడు.. అన్నట్టు ఆయన మాత్రమే అలా ఉన్నారా..? లేకపోతే మీరు కూడా అలా తయారయ్యారా..? అని అడగ్గానే..
అదేంటి వదిన అలా అంటున్నారు.. అని కళ్యాణ్ అనగానే.. ఆయన బుద్దులేవైనా వచ్చి నాచెల్లని మీరు కూడా ఇబ్బంది పెడుతున్నారేమోనని అడుగుతున్నాను. కవి గారు మీరు అలాంటి పిచ్చిపనులు ఏమైనా చేశారు అనుకో.. అంటు స్వీట్ వార్నింగ్ ఇస్తుంటే.. అయ్యో అలా ఏం లేదు వదిన తను సంతోషంగానే ఉంది అంటాడు కళ్యాణ్. ఉంటుంది లేండి కవిగారు దాన్ని మాత్రమే కాకుండా తన కడుపులో పెరుగుతున్న బిడ్డను ప్రేమించే వాడు దొరికాడు కదా అందుకే సంతోషంగా ఉంటుంది. అంటూ రత్తాలును తనకు జ్యూస్ తీసకురమ్మని చెప్తుంది కావ్య. తీసుకొస్తానిన రత్తాలు కిచెన్‌లోకి వెళ్తుంది.
రాజ్ కూడా కిచెన్‌లోకి వెళ్లి కావ్యకు జ్యూస్ తను చేస్తానని రత్తాలుకు చెప్పి అక్కడి నుంచి పంపిచేస్తాడు. జ్యూస్ చేసిన రాజ్ అందులో తాను తీసుకొచ్చిన అబార్షన్ మెడిసిన్స్ కలుపుతాడు. ఆ జ్యూస్ తీసుకెళ్లి కావ్యకు ఇస్తాడు. కావ్య జ్యూస్ తీసుకుని తాగేస్తుంది. అంతా దూరం నుంచి చూస్తున్న కళ్యాణ్ బాధపడుతుంటాడు. అన్నయ్యేంటి ఇలా చేస్తున్నారు.. వదినను కాపాడటానికి తను చేస్తుంది మంచి పనే కావచ్చు కానీ ఇలా చేయడం కరెక్టు కాదు. వదినకు ఏమాత్రం డౌటు వచ్చినా అన్నయ్యకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. లేదు వదిన కడుపులో ఉన్న బిడ్డను తీయించేయడానికి ఈ పద్దతి కరెక్టు కాదు.. వదిన ఆ జ్యూస్ తాగకూడదు.. అంటూ కళ్యాణ్ రాజ్ రూంలోకి పరుగెత్తకుంటూ వెళ్తాడు. మరోవైపు రూంలో కావ్య జ్యూస్ తాగుతూ ఉంటుంది. కళ్యాణ్ వెళ్లే సరికి జ్యూస్ మొత్తం తాగేస్తుంది.
కళ్యాణ్ ఏం చేస్తున్నావు వదిన అని అడగ్గానే.. జ్యూస్ తాగాను కవిగారు.. మీ అన్నయ్య జ్యూస్ ఇచ్చారు కదా అంటూ వెళ్లిపోతుంది. అన్నయ్య ఏంటిది నువ్వు అర్జెంట్ గా బయటకు రా అంటూ రాజ్‌ను తీసుకుని బయటకు వెళ్తాడు.. దీంతో రాజ్ అరేయ్ ఏంట్రా..? అని అడగ్గానే.. ఇంకా ఏం కావాలి అన్నయ్య చేయాలసిందంతా చేశావు కదా..? నేను అప్పటికీ వద్దు వద్దు అంటూ మొత్తుకుంటూనే ఉన్నాను. కానీ నువ్వు నా మాట వినకపోగా ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేశావు.. వదినేమో గుడ్డిగా నమ్మేసి ఆ జ్యూస్ తాగేసింది. ఇప్పుడు వదినకు ఏమైనా అయితే ఎవరన్నయ్యా రెస్పాన్స్‌బులిటీ.. ఇలాంటి పనులు చేసే ముందు ఒకటి పది సార్లు ఆలోచించాలి.. ఇంత స్వార్థ పరుడివి అయ్యావేంటి అన్నయ్య నువ్వు ఉండు ఆంబులెన్స్‌కు ఫోన్ చేస్తాను అంటూ కాల్ చేయబోతుంటే..
రాజ్ ఫోన్ లాక్కుని ఏమీ వద్దు.. నువ్వేం కంగారు పడకు.. మీ వదినకు ఏమీ కాదురా..? నువ్వున్నట్టు కళావతి జ్యూస్ తాగిన మాట వాస్తవమే.. కానీ ఆ జ్యూస్‌లో నేను టాబ్లెట్ కలపలేదు.. అని చెప్తాడు. దీంతో కళ్యాణ్ ఏం అంటున్నావు అన్నయ్యా.. అని కళ్యాణ్ అడగ్గానే.. అవునురా నేను గ్లాస్ మార్చేశాను.. అంటూ తాను జ్యూస్ గ్లాస్ మార్చింది విషయం చెప్పి ఎమోషనల్ అవుతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.