TV: ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ విషయం ఎలా జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఎన్నో కలలతో వివాహానికి సిద్ధమైన ఒక నటి.. త్వరలో ఏడడుగులు వేయబోతున్నాను అని తెలిసి ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. కానీ ఆ సంతోషం మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. తనకు నచ్చిన వాడిని వివాహం చేసుకోబోతున్నాను అనే సంతోషంలో మునిగిపోయిన ఆ నటికి.. ఊహించని షాక్ తగిలింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోందని చెప్పవచ్చు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఆమె ఎవరో కాదు ప్రముఖ టీవీ నటి సోహానీ కుమారి (Sohani Kumari). ఈమె కాబోయే భర్త సవాయి సింగ్(Savai Singh) ఆత్మహత్య చేసుకున్నారు..సెప్టెంబర్ 29న హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తమ ఫ్లాట్లో ఆయన ఉరి వేసుకొని మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేసి తన గత తప్పుల కారణంగానే ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు. సోహాని సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అటు ఈ జంటకు గత ఏడాది జూలైలో నిశ్చితార్థం జరిగినది. మరి సవాయి సింగ్ ఆత్మహత్య ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.
ఆత్మహత్య చేసుకోవడానికి కారణం..?
విషయంలోకి వెళ్తే.. రాజస్థాన్ కి చెందిన సోహానీ కుమారి రెండు మూడు సినిమాలలో కూడా నటించింది సవాయి సింగ్ తో ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడగా.. అక్కడినుంచి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్లకు స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ లో ఒక రెంటెడ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుని సహజీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ సవాయిసింగ్ మాత్రం ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అయితే సవాయిసింగ్ ఆత్మహత్యకు పాల్పడినప్పుడు సోహాని ఇంట్లో లేరు. ఆమె తిరిగి వచ్చేసరికి డైనింగ్ రూమ్ లో తన కాబోయే భర్త ఉరేసుకుని కనిపించాడు.. దీంతో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన సోహానీ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.
మాజీ ప్రియురాలిని దర్యాప్తు చేయనున్న పోలీసులు..
పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. సవాయి సింగ్ తన మాజీ ప్రియురాలని మర్చిపోలేని స్థితిలో ఉన్నాడని, ఆర్థిక సమస్యల కారణంగా కూడా ఒత్తిడిలో ఉన్నాడని సోహాని కుమారీ పోలీసులకు తెలియజేసింది. ఇక ఈ సమస్యల కారణంగానే ఆయన బయటపడలేక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసింది.ఈ అందించిన సమాచారం మేరకు.. పోలీసులు మాజీ ప్రియురాలిని ఈ కేస్ దర్యాప్తులో భాగంగా విచారించాలని నిర్ణయించినట్లు సమాచారం.. ఏది ఏమైనా త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట ఇలా అతడు ప్రాణాలు కోల్పోయేసరికి నటి తట్టుకోలేకపోతుందని చెప్పవచ్చు.