Ntr Baby Kit: ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్‌ని పథకాన్ని మళ్లీ మొదలు పెట్టనుంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ కిట్ ను అందజేస్తారు. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ కిట్‌లోకి రెండు వస్తువులు చేరాయి. ఆ కిట్ విలువ దాదాపు రెండు వేల రూపాయలు.
మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్
2014-19 మధ్యకాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మంచి పథకాలను తీసుకొచ్చింది. వాటిలో కొన్నింటిని కాస్త మార్పులు చేర్పులు చేసి మొదలుపెట్టింది.. ఇంకా కంటిన్యూ అవుతోంది. అలాంటి వాటిలో ఎన్టీఆర్ బేబీ కిట్ ఒకటి. గతంలో ఈ కిట్ లో 11 వస్తువులు ఉండగా, ఇప్పుడు 13కు చేర్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆ స్కీమ్‌ని మొదలుపెట్టాలని ఆలోచన చేసింది. ఈ నేపథ్యంలో 26 జిల్లాల్లోని డీఎంహెచ్‌వోలు, డీసీహెచ్‌ఎస్‌లు, జీజీహెచ్‌లకు రెండేళ్ల పాటు రేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేస్తుంది APMSIDC సంస్థ. రాష్ట్రంలో ప్రతీ ఏటా సుమారు 3.20 లక్షల మంది తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కొత్తగా ఆ రెండు వస్తువులు
2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కారు ఆపేసింది. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో అదనంగా రెండు వస్తువులు చేరాయి. దీంతో మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. పథకం అమలుకు రూ.65 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వ అంచనా.
ALSO READ: ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త
ఎన్టీఆర్ కిట్‌లో ఉండే వస్తువులు ఏంటి? దోమ తెరతో కూడిన పరుపు, వాటర్ ప్రూఫ్ షీటు, దుస్తులు, న్యాప్కిన్లు, తువాలు, సబ్బు-దానికి సంబంధించిన బాక్సు, పౌడర్, ఆయిల్, షాంపూ, బొమ్మలు ఇలా 11 వస్తువులు ఉండేవి. అదనంగా ఫోల్డబుల్ బెడ్, ఓ బ్యాగును చేర్చారు. వీటిలో కిట్‌లో వస్తువుల సంఖ్య 13కి చేరింది. గతంలో ఒక్కో కిట్‌కు సుమారు రూ.1,504 ఖర్చు అయ్యేది.
కొత్తగా చేర్చిన రెండు వస్తువుల వల్ల అదనంగా రూ.450 పెరిగింది. ఆ లెక్కన ఒక్కో కిట్‌కు రూ.1954 ఖర్చు అవుతోందన్నమాట. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను వైద్యా ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ చేస్తోంది. ఈ పథకం నవంబర్ 14 నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రభుత్వం పలు సర్వేలు చేపట్టింది. దాని ఆధారంగా ఎంత ఖర్చు అవుతుందో ఓ అంచనాకు వచ్చింది.