iOS 26 Tricks Iphone| టెక్ దిగ్గజం ఆపిల్ కొత్తగా iOS 26 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ 200 కంటే ఎక్కువ మార్పులతో వచ్చింది, వీటిలో ఒకటి అద్భుతమైన లిక్విడ్ గ్లాస్ రూపం. పెద్ద మార్పులతో పాటు.. రోజువారీ ఉపయోగంలో ఐఫోన్‌ను సులభతరం చేసే చిన్న ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ రహస్య ట్రిక్స్ మీ ఐఫోన్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఆ రహస్య ఫీచర్ల వివరాలు మీ కోసం..
టెక్స్ట్‌ను సులభంగా కాపీ చేయండి
మెసేజెస్‌లో మీరు సేవ్ చేయాలనుకునే టెక్స్ట్‌ను ఎంచుకోండి. మెసేజ్‌పై ఎక్కువసేపు నొక్కి, “సెలెక్ట్” ఆప్షన్ ఎంచుకోండి. మీరు పూర్తి మెసేజ్‌ను లేదా URL, అడ్రస్ వంటి నిర్దిష్ట భాగాన్ని మాత్రమే హైలైట్ చేయవచ్చు.
రెసిపీలను సులభంగా సేవ్ చేయండి
రిమైండర్స్‌లో రెసిపీలను సేవ్ చేయడానికి సిరి ఏఐని ఉపయోగించండి. రెసిపీ టెక్స్ట్‌ను ఎంచుకుని, దాన్ని రిమైండర్స్‌కు షేర్ చేయండి. సిరి ఆటోమేటిక్‌గా షాపింగ్ లిస్ట్ లేదా రెసిపీని సృష్టిస్తుంది.
డిఫాల్ట్ యాప్‌లను ఎంచుకోండి
ఫైల్స్ యాప్‌లో ఫైల్‌లను తెరిచే డిఫాల్ట్ యాప్‌లను సెట్ చేయండి. ఫైల్‌పై ఎక్కువసేపు నొక్కి, “గెట్ ఇన్ఫో” ఎంచుకుని, “ఆల్వేస్ ఓపెన్ విత్” ఆప్షన్‌ను సెట్ చేయండి.
కస్టమ్ రింగ్‌టోన్‌లు సృష్టించండి
MP3 లేదా M4A ఫైల్‌తో మీ సొంత రింగ్‌టోన్‌ను తయారు చేయండి. ఫైల్‌పై ఎక్కువసేపు నొక్కి, “క్విక్ లుక్” ఎంచుకుని, “యూస్ యాస్ రింగ్‌టోన్” లింక్‌ను షేర్ చేయండి. రింగ్‌టోన్ 30 సెకన్ల వరకు మాత్రమే ఉండాలి.
సేవ్ చేయని మెసేజ్‌లను కనుగొనండి
మెసేజెస్‌లో సేవ్ చేయని టెక్స్ట్ మెసేజ్‌లను చూడండి. మూడు లైన్ల ఐకాన్‌పై క్లిక్ చేసి, ఫిల్టర్స్ ఎంచుకుని, డ్రాఫ్ట్స్ ఫోల్డర్‌ను చెక్ చేయండి.
మెరుగైన పనోరమా ఫొటోలు
iOS 26తో పనోరమా ఫోటోలు మరింత స్పష్టంగా ఉంటాయి. వేగంగా కదిలినా బ్లర్ లేకుండా ఫోటోలు తీయవచ్చు.
వీడియోలలో కచ్చితమైన క్షణాన్ని కనుగొనండి
ఫోటోస్, వీడియోలలో మీకు కావాల్సిన క్షణాన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ టర్మ్ ఎంటర్ చేస్తే.. ఆ కంటెంట్ ఉన్న ఫ్రేమ్ థంబ్‌నెయిల్స్ కనిపిస్తాయి. ఆ థంబ్‌నెయిల్‌పై క్లిక్ చేస్తే ఆ క్షణానికి నేరుగా వెళ్తుంది.
కెమెరాను శుభ్రంగా ఉంచండి
ఐఫోన్ 15, తర్వాత మోడల్స్‌లో, వెనుక కెమెరా లెన్స్ మురికిగా ఉంటే హెచ్చరిక వస్తుంది. దీనివల్ల మీ ఫోటోలు స్పష్టంగా, పవర్ ఫుల్‌గా ఉంటాయి.
కేస్‌కు సరిపోలే ఐకాన్‌లు
మీ మాగ్‌సేఫ్ కేస్‌కు సరిపోయే హోమ్ స్క్రీన్ ఐకాన్‌లను టిన్ట్ చేయవచ్చు. హోమ్ స్క్రీన్‌పై ఎక్కువసేపు నొక్కి, ఎడిట్, కస్టమైజ్ ఎంచుకుని, టిన్టెడ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
ఈవెంట్ సమాచారం చూడండి
ఫోటోస్‌లో మ్యూజిక్ కాన్సర్ట్ సమాచారాన్ని చూడవచ్చు. iOS 26 మీరు తీసిన ఈవెంట్ ఫోటోలలో టాప్ సాంగ్స్, రాబోయే షోల వివరాలను చూపిస్తుంది.
కాల్ బ్యాక్ రిమైండర్ షెడ్యూల్ చేయండి
మిస్డ్ కాల్ వచ్చిందా?.. రిమైండర్ సెట్ చేయండి. మిస్డ్ కాల్‌పై ఎడమవైపు స్వైప్ చేసి, క్లాక్ ఐకాన్‌ను నొక్కి, కాల్ బ్యాక్ సమయాన్ని ఎంచుకోండి.
ఆడియో స్విచ్చింగ్ కంట్రోల్
ఎయిర్‌పాడ్స్‌లో ఆడియో ఉండాలంటే, ఈ ఫీచర్‌ను ఆఫ్ చేయండి. సెట్టింగ్స్‌లో జనరల్, ఎయిర్‌ప్లే అండ్ కంటిన్యూటీకి వెళ్లి, “కీప్ ఆడియో ఇన్ హెడ్‌ఫోన్స్” ఆన్ చేయండి.
సులభంగా బ్యాక్ స్వైప్ చేయండి
మునుపటి స్క్రీన్‌కు వెళ్లడానికి స్క్రీన్ ఎక్కడైనా కుడివైపు స్వైప్ చేయండి. ఇది స్క్రీన్ ఎడ్జ్‌లోనే కాకుండా ఎక్కడైనా పనిచేస్తుంది.
ఈ iOS 26 ట్రిక్స్ మీ ఐఫోన్ ఉపయోగాన్ని మెరుగుపరచడమే కాకుండా సులభతరం చేస్తాయి. వీటిని ప్రయత్నించి, మీ ఐఫోన్ ఎక్స్‌పీరియన్స్ మరింత స్మార్ట్‌గా మార్చుకోండి!
Also Read: ఈ ఏటిఎం పిన్‌లు ఉపయోగిస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ.. సైబర్ నిపుణుల హెచ్చరిక!