BigTV English

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

London News: మహాత్మాగాంధీ జయంతి ముందుకు ఊహించని ఘటన జరిగింది. లండన్‌లోని టావిస్టాక్ స్క్వేర్‌లో గాంధీ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పిచ్చి రాతలు రాశారు. ఒకానొక దశలో విగ్రహం పగలగొట్టేందుకు ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భారత్ రాయబార కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖండించింది. దీన్ని సిగ్గు చేటుగా వర్ణించింది.


గాంధీ విగ్రహంపై పిచ్చిరాతలు

లండన్‌లో జాత్యహంకారుల పిచ్చి చేష్టలు మొదలయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు మహాత్మాగాంధీ విగ్రహంపై ఇష్టానుసారంగా పిచ్చి రాతలు రాశారు. గాంధీ జయంతి వేడుకలకు మూడురోజుల ముందు ఈ ఘటన జరగడంతో అనుమానాలు మొదలయ్యాయి. దీని వెనుక ఉన్నదెవరు? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టింది ప్రభుత్వం.


లండన్‌లోని టావిస్టాక్‌ స్క్వేర్‌ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. అక్టోబరు 2న గాంధీ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలో జాత్యహంకారులు భారత వ్యతిరేక రాతలు రాశారు. ఈ విషయం తెలియగానే లండన్‌లో భారత రాయబార కార్యాలయం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. దీన్ని సిగ్గుచేటు చర్య, అహింస భావనపై హింసాత్మక దాడిగా అభివర్ణించింది.

ALSO READ:  లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలన నిర్ణయం

దీనిపై ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యింది. అహింసా దినోత్సవానికి కొన్నిరోజుల ముందు జరిగిన ఈ ఘటన..విధ్వంసం కాదని, మహాత్ముడి వారసత్వంపై జరిగిన హింసాత్మక దాడిగా పేర్కొంది. దీనికి బాధ్యులైనవారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను కోరుతున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. వెంటనే పునరుద్ధరణపై చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

దీనివెనుకున్నదెవరు?

ఈ ఘటనపై చర్యలు ప్రారంభించినట్టు స్థానిక మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపారు. ఇండియా లీగ్ మద్దతుతో తయారు చేసిన కాంస్య విగ్రహాన్ని 1968లో స్క్వేర్ వద్ద ఆవిష్కరించిన విషయం తెల్సిందే.  గాంధీ విగ్రహం అర్ధ శతాబ్దానికి పైగా శాంతికి చిహ్నంగా నిలిచింది. కళాకారిణి ఫ్రెడ్డా బ్రిలియంట్ తయారు చేశారు. అప్పటి బ్రిటిష్ ప్రధాన మంత్రి హెరాల్డ్ విల్సన్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మార్చిలో విదేశాంగ మంత్రి జైశంకర్ యూకే పర్యటన సందర్భంగా లండన్‌లో ఖలిస్తానీ మద్దతుదారులు నిరసనలు తెలిపారు. ఆ సమయంలో నిరసనకారులు చాథమ్ హౌస్ వెలుపల గుమిగూడి జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. ఇది జరిగి దాదాపు ఆరు నెలల తర్వాత ఈ విధ్వంసక చర్య జరిగింది.

 

Related News

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Donald Trump: టాలీవుడ్‌కు ట్రంప్ షాక్.. ఇక అమెరికాలో తెలుగు సినిమాలు రిలీజ్ కష్టమేనా?

Pakistan: మీ పాలన మాకొద్దు.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్ర ఉద్రికత్త

America: అమెరికాలోని మిషిగాన్‌లో కాల్పుల కలకలం.. నలుగురు మృతి, మరో 9 మందికి గాయాలు..

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Big Stories

×