BigTV English

Lakshmi Narayan Yog 2024: లక్ష్మీ నారాయణ యోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు

Lakshmi Narayan Yog 2024: లక్ష్మీ నారాయణ యోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు

Lakshmi Narayan Yog 2024: వేదజ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల కదలికలు, రాశుల మార్పులు.. ద్వాదశరాశులపై ప్రభావాన్ని చూపుతాయి. జూలై 15న రవియోగం, సిద్ధయోగం, కరణయోగం, లక్ష్మీనారాయణ యోగం, శివ్వాస యోగం.. అనే ఐదు శుభయోగాలు కలిశాయి. దీనివల్ల మేషం, సింహం, తుల, ధనస్సు, మకర రాశులవారికి శుభఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా.. లక్ష్మీనారాయణ యోగం వల్ల మూడు రాశుల వారికి ఊహించని శుభఫలితాలు కలగనున్నాయి. ఆర్థిక స్థిరత్వం కూడా ఉండనుంది.


లక్ష్మీనారాయణ యోగం ఫలితాలు

ఈ యోగం వల్ల రాశుల వారికి వ్యాపారం, వ్యవసాయాలతో పాటు జీతభత్యాలు పెరుగుతాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. జ్ఞానం, బుద్ధి పెరుగుతాయి. ఎవరితో ఎలా మసులుకోవాలో నేర్చుకుంటారు. భవిష్యత్ పై స్పష్టమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. కుటుంబంలో సంతోషం, ఆనందం ఉంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది.


మేషరాశి

లక్ష్మీనారాయణ యోగం వల్ల ఈ రాశివారికి వృత్తిలో పురోభివృద్ధి ఉంటుంది. విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్, జీతం పెరగటం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలను సృష్టించుకుంటారు. అప్పులు తీరుతాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వైవాహిక జీవితం సంతోషంగా గడుపుతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తిలో ఒత్తిడి, ఆందోళన కారణంగా నిద్రలేమి కలిగే అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి సమయం. చదువుపై ఏకాగ్రత పెడితే.. పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి.

మిథున రాశి

ఈ రాశివారికి నైపుణ్యాలు, సృజనాత్మకత మెరుగుపడతాయి. విదేశీ పరిచయాలతో కొత్త ప్రాజెక్టులు పొందుతారు. ప్రాజెక్టుల్లో విజయం సాధిస్తారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకుంటారు. అనవసర ఖర్చులను మాత్రం అదుపులో ఉంచుకోవాలి. జ్వరం వంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయి. విద్యార్థులకు విద్యారంగంలో మంచి సమయం. ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి

ఈ రాశివారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా మంచి సమయం. ఆదాయాన్ని పెంచుకునేందుకు, కొత్త ఆదాయ వనరులను సృష్టించుకునేందుకు ఇదే మంచి అవకాశం. కానీ.. వైవాహిక జీవితంలో అపార్థాలు రావొచ్చు. పిల్లల కారణంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(గమనిక : ఇంటర్నెట్ లో లభ్యమైన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ ను రాశాం. bigtvlive.com దీనిని ధృవీకరించదు)

 

 

 

 

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×