BigTV English

Best Panoramic Sunroof Cars: సన్‌రూఫ్‌ కార్లు.. టాప్ ప్లేస్‌ వీటికే సొంతం!

Best Panoramic Sunroof Cars: సన్‌రూఫ్‌ కార్లు.. టాప్ ప్లేస్‌ వీటికే సొంతం!

Best Panoramic Sunroof Cars: సన్‌రూఫ్ ఉన్న కార్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ కారుల్లో ప్రయాణం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో సన్‌రూఫ్‌పై నీరు పడినప్పుడు ఆ దృశ్యం చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అయితే ఈ కార్లను కొనుగోలు చేయడానికి బడ్జెట్ కూడా చాలా ముఖ్యం. దేశీయ మార్కెట్‌లో సన్‌రూఫ్‌తో కూడిన కార్లు చాలా ఉన్నాయి. వీటి ధరలు రూ. 12.50 లక్షల నుండి రూ. 15.50 లక్షల వరకు ఉంటాయి. ఈ కార్లు ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో వస్తాయి. పనోరమిక్ సన్‌రూఫ్‌తో కూడిన అలాంటి 5 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1) Mahindra XUV 3XO
పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ టాప్-ఎండ్ AX7 ట్రిమ్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.12.49 లక్షల నుంచి మొదలవుతుంది. దేశంలో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించే ఏకైక కాంపాక్ట్ SUV XUV 3XO.

Also Read: Yamaha MT-09: యమహా నుంచి క్లచ్ లెస్ బైక్.. పిచ్చిరేపుతున్న స్పీడ్.. లాంచ్ ఎప్పుడంటే?


2) MG Astor
MG ఆస్టర్ కస్టమ్ వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్ అందుబాటులో ఉంది. ఈ SUV 110hp పవర్, 44Nm టార్క్‌తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVTతో లింకై ఉంటుంది. ఇది మరొక 1.3-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ వేరియంట్ కలిగి ఉంది. ఇది 140hp పవర్, 220Nm టార్క్‌తో వస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 13.11 లక్షలు.

3) kia seltos
రూ. 14.06 లక్షల నుండి కియా సెల్టోస్‌లో హెచ్‌టికె+ వేరియంట్‌తో పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 14.06 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది 115hp పవర్, 144Nm టార్క్‌తో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 116hp పవర్, 250Nm టార్క్‌తో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్, 160hp పవర్, 253Nm టార్క్‌తో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.

4) Hyundai Creta
హ్యుందాయ్ క్రెటా మిడ్-స్పెక్ S (O) వేరియంట్ నుండి పనోరమిక్ సన్‌రూఫ్‌ అందిస్తోంది. దీని ధర రూ. 14.36 లక్షల నుండి ప్రారంభమవుతుంది. సెల్టోస్ వలె ఇది 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు కలిగి ఉంది.

Also Read: Upcoming SUV in August: కొత్త కార్లు వస్తున్నాయి.. డిజైన్ అదిరిపోయింది.. రేంజ్‌లో తగ్గేదే లేదు!

5) Maruti Suzuki Grand Vitara
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మైల్డ్-హైబ్రిడ్ వెర్షన్‌లో ఆల్ఫా వేరియంట్ నుండి పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందిస్తోంది. ఇది 103hp పవర్, 137Nm టార్క్‌తో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింకై ఉంటుంది. మరొక వేరియంట్ 116hp పవర్‌తో 1.5-లీటర్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ e-CVT. దీని ధర రూ. 15.51 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

Related News

WhatsApp: ఒకే ఫోన్‌లో 2 వాట్సప్ అకౌంట్లు.. లాగ్అవుట్ లేకుండా వాడే కొత్త ట్రిక్..

Amazon Great Indian Festival: బ్రాండెడ్ ఫ్రిజ్‌లపై 55 శాతం తగ్గింపు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో భారీ ఆఫర్స్

Flipkart SBI Offers: ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్.. ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్‌తో ఇన్ని లాభాలా?

Gold Rate Increase: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..!

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Big Stories

×