E-Paper
Advertisement

Lakshmi Narayana Yoga: జులైలో రెండు సార్లు లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారికి డబుల్ ధమాకా

Lakshmi Narayana Yoga: జులైలో రెండు సార్లు లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశుల వారికి డబుల్ ధమాకా
Advertisement

Lucky Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిచక్రం, గ్రహాల కూటమిలో మార్పు చాలా ముఖ్యమైంది. ఒక రాశిలో గ్రహాల సంచారం అనేక అరుదైన కలయికలను, రాజ యోగాలను ఏర్పరుస్తుంది. దీని కారణంగా మేషం నుంచి మీనం వరకు 12 రాశుల మీద ప్రభావం ఉంటుంది. జూలై నెలలో లక్ష్మీనారాయణ యోగం రెండు సార్లు ఏర్పడనుంది. గ్రహాల రాకుమారుడైన బుధుడు జూన్ 29 నుంచి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు.

జూలై 19 వరకు ఇదే రాశిలో ఉంటాడు. అదే సమయంలో జూలై 7 నుంచి సంపదను ఇచ్చే శుక్రుడు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడి సంచారం వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది.జూలై 19న బుధుడు తన రాశిని రెండోసారి మార్చుకుంటాడు. జూలై 19న సింహ రాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత జూలై 31 న శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల కర్కాటక, సింహ రాశులలో బుధుడు శుక్రుడు కలయిక వల్ల లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడనుంది.

Advertisement

ఫలితంగా జులైలో రెండు సార్లు లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన కలయిక వల్ల కొన్నిరాశుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఐశ్వర్యం సంతోషం, సౌభాగ్యం కూడా పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. లక్ష్మీనారాయణ యోగం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కర్కాటక రాశి:
లక్ష్మీనారాయణ యోగం ఏర్పడడం వల్ల కర్కాటక రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు. దీంతో ఆర్థిక లాభాలకు బలమైన అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇది మీ జీవనశైలిని ప్రభావితం చేస్తుంది. సుఖాలు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం.
సింహ రాశి:
జులైలో రెండు సార్లు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం వల్ల సింహరాశి వారికి మేలు జరుగుతుంది. వ్యాపార విస్తరణ చాలా బాగుంటుంది. చాలా కాలం క్రితం పోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచిపోతారు. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. అంతేకాకుండా సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరమైన విషయాల్లో కూడా విజయం సాధిస్తారు. సుఖాలు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.

Advertisement

Also Read: నవంబర్ వరకు వ్యతిరేక దశలో శని.. ఈ 3 రాశులపై అరుదైన రాజయోగం..

వృశ్చిక రాశి:
జులై నెలలో లక్ష్మీనారాయణ యోగం వల్ల వృశ్చికరాశి వారి కలలు నెరవేరుతాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ప్రేమ సంబంధంలో మాధుర్యం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభంతో పాటు..వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగపంగా శుభవార్తలు వింటారు. విద్యార్థులు కెరీర్ పరంగా ఉన్నత స్థానంలో ఉంటారు. డబ్బును ఖర్చు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. పెట్టుబడులు మీకు లాభాలను తెెచ్చిపెడతాయి. ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఫలితంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×