BigTV English

Surendra: ఘంటసాల అల్లుడు.. 50 సినిమాల్లో నటించాడని మీకు తెలుసా.. ?

Surendra: ఘంటసాల అల్లుడు.. 50 సినిమాల్లో నటించాడని మీకు తెలుసా.. ?

Surendra: ఏళ్లు మారినా.. జనరేషన్ చేంజ్ అయినా.. కొన్ని సాంగ్స్ ఎప్పుడు గుర్తుంటునే ఉంటాయి. అలాంటి పాటల్లో గున్నమామిడి కొమ్మ మీద గూళ్లు రెండు ఉన్నాయి అనే సాంగ్ కచ్చితంగా ఉంటుంది. కొంగర జగ్గయ్య, కృష్ణంరాజు, గుమ్మడి, నాగభూషణం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బాలమిత్రుల కథ. ఈ సినిమా 1973 లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.


సినిమా ఏమో కానీ, ఈ సాంగ్ కు మాత్రం సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది. ఇద్దరు మిత్రుల స్నేహబంధం గురించి ఈ పాటలో ఎంతో గొప్పగా చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పటికీ ఇద్దరు స్నేహితుల గురించి చెప్పాలంటే ఈ పాటను ఉదాహరణగా చెప్పుకొస్తారు. సరే ఇదంతా కాదు.. అసలు ఇప్పుడు ఈ సాంగ్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామా.. ? అని అంటారా.. ? సాంగ్ గురించి కాదు. అందులో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం.

అతను కూడా అందరిలా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ యే కదా అంటే పొరపాటే. ఇప్పుడు ఆయన లెజండరీ సింగర్ ఘంటసాల అల్లుడు కావడమే. అవును.. మీరు వింటుంది నిజమే. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సురేంద్ర. ఇప్పటివరకు ఘంటసాల వారసులు అంటూ ఎవరు లేరనే అందరూ అనుకుంటూ వచ్చారు. తాజాగా సురేంద్ర తాను ఉన్నానని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ఘంటసాల కుమార్తె శాంతి భర్తనే సురేంద్ర.


చిన్నతనంలో ఆయన 50 కి పైగా సినిమాల్లో నటించాడట. ప్రస్తుతం చెన్నైలో బిజినెస్ మ్యాన్ గా కొనసాగుతున్న సురేంద్ర.. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నాడు. ” నాకు చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. మా అమ్మగారికి నేను నటించడం అంటే చాలా ఇష్టం. ఆమెకు నేను హీరో కావాలని ఉండేది. అది నాకు ఇష్టం ఉండేది కాదు. ఘంటసాల గారి కుటుంబానికి, నాకు ఎలాంటి చుట్టరికం లేదు. శాంతి, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం” అని చెప్పుకొచ్చాడు. ఘంటసాల మరణించే సమయానికి శాంతి వయస్సు 11, సురేంద్ర వయస్సు 13. ఆయన మరణించిన కొన్నేళ్ళకు వీరు ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం సురేంద్ర ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×