E-Paper
Advertisement

Rahu Favorite Zodiac Signs: రాహువుకు ఇష్టమైన రాశులు ఇవే..

Rahu Favorite Zodiac Signs: రాహువుకు ఇష్టమైన రాశులు ఇవే..
Advertisement

Rahu Favorite Zodiac Signs: జోతిష్య శాస్త్రంలో రాహు, కేతు, శని గ్రహాలను అశుభ గ్రహాలుగా భావిస్తారు. రాహు, కేతువు రెండు తిరోగమన దిశలోనే సంచరిస్తాయి. రాహువును అంతుచిక్కని గ్రహంగా కూడా పిలుస్తారు. అలా అని రాహువు ఎప్పుడూ అశుభ ఫలితాలను ఇస్తాడని కాదు. రాహువుకు ఇష్టమైన రాశులు కూడా ఉన్నాయి. ఈ రాశులపై రాహు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

ఈ రాశుల వారు ఆర్థికంగా కూడా బలంగా ఉంటారు. ఎల్లప్పుడూ సమాజంలో వీరికి గౌరవం ఉంటుంది. రాహువు చాలా సందర్భాల్లో శుభ లేదా సానుకూల ఫలితాలను ఇస్తాడు. కొన్ని సార్లు ఊహించలేని సానుకూల ఫలితాలను కూడా ఇస్తాడు. రాహువు ఏ పరిస్థితిలో ఏ రాశులకు శుభఫలితాలు ఇస్తాడనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రాహువు స్వభావం:
జ్యోతిషశాస్త్రంలో రాహువు ఊహించని సంఘటనలకు కారకంగా అభివర్ణించారు. అహంకారాన్ని భగ్నం చేసి విచ్చిన్నం చేసే గ్రహం రాహువు. జీవితంలో ఏదైనా కష్టం, ఆకస్మిక మంచి, చెడు సంఘటనలకు రాహువు కారణమని భావిస్తారు. జాతకంలో రాహు స్థానం శుభప్రదంగా ఉంటే రాహువు ఆ రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తాడు. రాహువు శుభ స్థానంలో లేకపోతే వ్యక్తిగత సంబంధాలతో పాటు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతాయి.

రాహువు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. చెడు స్థానంలో ఉంటే రాహు ప్రభావం తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. వ్యక్తి జాతకంలో రాహు మూడు లేదా ఆరో స్థానంలో ఉంటే చాలా శుభ ఫలితాలను పొందుతారు. మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. పనిలో విజయాలు సాధించడంతో పాటు సంపద పెరుగుతుంది. ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

రాహువు జాతకంలో శుభ స్థానంలో ఉంటే సకల సుఖాలను ఇస్తాడు. అంతే కాకుండా అన్నింటిలో విజయం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారు శుభవార్తలు వింటారు. జాతకంలో 11వ స్థానంలో ఉన్న రాహువు శుభ ఫలితాలను ఇస్తాడు. ఫలితంగా ఉద్యోగస్తులకు అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయి. ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. రాహువు స్థానం వల్ల డబ్బు, కీర్తి, సంపద, ధైర్యం లభించడంతో పాటు సత్ఫలితాలు పొందుతారు.
రాహువుకు ఇష్టమైన రాశులు ఇవే..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు ప్రతి రాశిపై తన ప్రభావాన్ని చూపిస్తాడు. కానీ 12 రాశుల్లో రాహువుకు చాలా ఇష్టమైనవి రెండు రాశులని చెబుతుంటారు. రాహువు అనుగ్రహం ఎప్పుడూ ఈ రాశులపై ఉంటుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి:
సింహా రాశిని రాహువు ఇష్టపడతాడు. సింహా రాశిలో రాహువు సంచరించినపుడు ముఖ్యంగా నాలుగు చాలా శుభఫలితాలు ఇస్తాడు.ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తాడు. అంతేకాకుండా వారి జీవితంలో పెద్ద మార్పులను కూడా తీసుకువస్తాడు. రాహుగ్రహం వల్ల వారి సంపద బాగా పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Also Read: నవంబర్ నెల వరకు ఈ 5 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

వృశ్చిక రాశి:
రాహువుకు ఇష్టమైన రాశుల్లో వృశ్చికరాశి కూడా ఒకటి. రాహు ప్రభావం వల్ల వీరు కెరీర్‌లో మంచి విజయాలు సాధిస్తారు. వీరు చేసే వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. రాహువు అనుగ్రహం వల్ల ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో వీరికి గౌరవ, మర్యాదలు లభిస్తాయి.

 

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×