BigTV English
Advertisement

First Time in Indian Military history: వీళ్లిద్దరు చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు దేశ అత్యున్నత అధికారులు

First Time in Indian Military history: వీళ్లిద్దరు చిన్ననాటి స్నేహితులు.. ఇప్పుడు దేశ అత్యున్నత అధికారులు

Two Classmates to be Chiefs of Indian Army and Navy together: అప్పుడప్పుడు ఊహించని సందర్భాలు చోటు చేసుకుంటాయి. ఇది నిజమా..? కలనా? అన్న చందంగా ఆశ్చర్యం వేస్తది. కొందరి విషయంలో ఊహకే పరితమైతే.. మరికొందరి విషయాల్లో నిజరూపం దాల్చుతాయి. ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను అంటే.. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు.


అయితే, ఆయన చిన్ననాటి మిత్రుడు కూడా దేశ రక్షణదళానికి చెందిన అత్యున్నత కమాండర్ గా ఉన్నారు. ఆయనెవరో కాదు.. దినేష్ త్రిపాఠి. ఈయన నౌకాదళ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాల్య స్నేహితులు దేశ రక్షణదళాల అత్యున్నత కమాండర్లుగా నియామకం కావాడంతో ఆసక్తి నెలకొన్నది. ఈ విషయం తెలిసి దేశవ్యాప్తంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతుంటాయంటూ వారి వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉపేంద్ర ద్వివేది, దినేష్ త్రిపాఠి 1970లో మధ్యప్రదేశ్ రేవాలోని సైనిక్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం వీరు వేర్వేరు దళాలకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ పరస్పరం సలహా సంప్రదింపులు జరుపుతుంటారు. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘ఇద్దరు అద్భుతమైన విద్యార్థులను మిలటరీలో అత్యున్నత సేవలు అందించగలిగే ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దిన అరుదైన గౌరవం రేవాలోని సైనిక్ స్కూల్ కు దక్కుతుంది’ అంటూ ఆయన అభినందనలు తెలిపారు.


జులై 1, 1964 జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984 డిసెంబర్ 15న ఆర్మీలో చేరారు. అనంతరం వివిధ కీలక పోస్టుల్లో పని చేశారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్ గా సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించారు.

Also Read: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేనతో కలిసి పోటీ చేస్తాం: శరద్ పవార్

ఇదిలా ఉంటే.. ఆర్మీ చీఫ్ గా రెండేళ్లపాటు దేశానికి సేవలందించిన జనరల్ మనోజ్ పాండే ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయనను గార్డ్ ఆఫ్ హానర్ తో అధికారులు గౌరవించారు. మనోజ్ 2022 ఏప్రిల్ 30న ఆర్మీ చీఫ్ గా నియమితులయ్యారు. వాస్తవానికి పాండే మే 30న రిటైర్ అవ్వాల్సి ఉంది. అయితే, ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయన సర్వీసును ఒక నెల రోజులపాటు పొడిగించింది. ఈ క్రమంలో ఆయన జూన్ 30న పదవీ విరమణ చేశారు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×