E-Paper
Advertisement

Libra August 2024 Horoscope: ఆగస్టు 2024లో తులా రాశి వారి జీవితంలో జరిగేది ఇదే !

Libra August 2024 Horoscope: ఆగస్టు 2024లో తులా రాశి వారి జీవితంలో జరిగేది ఇదే !

Libra August 2024 Horoscope: తులా రాశిలో జన్మించిన వారు ఆగస్టు నెలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ఈ సమయంలో మీ కెరీర్‌లో చాలా పురోగతి వచ్చే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు వివేకాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ రాశిలో రాహువు ఆరవ ఇంట్లో స్థితి పొందనున్నాడు. శని ఐదవ ఇంటిలో సంచరిస్తాడు. బృహస్పతి, కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశముంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఆర్థిక విషయాలకు సంబంధించి ఆగస్టు నెల మొదట్లో బలహీనంగా ఉంటుంది. మీకు ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. డబ్బు ఆచితూచి ఖర్చు చేయడం మంచిది. కెరీర్ పరంగా తులా రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. ప్రమోషన్లు పొందే అవకాశాలున్నాయి. జీతం పెరుగుతుంది. వ్యాపారులకు ఈ సమయం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు విద్యాపరంగా విజయాలు సాధించడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వైవాహిక జీవితంలో అత్తమామలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

తులా రాశి వారి జీవితం ఆగస్టు నెలలో కొన్ని రోజులు బాగుంటుంది. బృహస్పతి రెండవ ఇంటి అధిపతి అయినప్పుడు కుజుడు ఎనిమిదింటిలో సంచరించడం వల్ల సొంతింటిని చూస్తాడు . బృహస్పతి కుజుడుతో పాటు ఈ స్థితి అక్కడి నుంచి రెండవ ఇంటిని, నాలుగో ఇంటిని కూడా చూస్తాడు. దీంతో కుటుంబ జీవితంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మీరు కుటుంబం కోసం బాగా ఆలోచిస్తూ ఉంటారు. మీ తల్లి ఆరోగ్యం కూడా సురక్షితంగా ఉంటుంది. కానీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం.

తోబుట్టువుల విషయానికి వస్తే వారి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. సమస్యలు వచ్చనప్పటికీ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడి ఏ పని చేయకుండా ఉంటే మంచిది.వృత్తి పరంగా సాధారణంగా ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆత్మ గౌరవం కూడా పెరుగుతుంది. పరిస్థితుల కారణంగా మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు హాని కలిగిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వ్యాపారంలో మొదటి మూడు వారాలు సమస్యలను ఎదుర్కొంటారు. చివరి వారంలో మీ వ్యాపారం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు గత పనుల్లో లోపాలు కనిపిస్తున్నాయి. ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను మీరు అందుకుంటారు. ఈ నెలలో మీకు అనుకోని ఖర్చులు ఎక్కువవుతాయి. ఉద్యోగులకు జీతం కూడా పెరుగుతుంది. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.

Also Read: ఆగస్టులో వృశ్చిక రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్త !

ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సకాలంలో ఆహారం తీసుకోవడం జరగకపోవచ్చు. దీంతో మీ ఆరోగ్యం క్షీణిస్తుందని అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×