E-Paper
Advertisement

Lord Krishna: జీవితం ఒక కురుక్షేత్రం అయితే.. శ్రీకృష్ణుడి ఈ 7 సూత్రాలే మీ విజయానికి ఆయుధాలు!

Lord Krishna: జీవితం ఒక కురుక్షేత్రం అయితే.. శ్రీకృష్ణుడి ఈ 7 సూత్రాలే మీ విజయానికి ఆయుధాలు!
Advertisement

Lord Krishna: కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి కలిగిన విషాదాన్ని దూరం చేయడానికి శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం, నేటి ఆధునిక మానవుడికి కూడా అంతే అవసరం. నేటి పోటీ ప్రపంచంలో మనిషి పరుగులు తీస్తున్నాడు కానీ గమ్యం తెలియక, ప్రశాంతత లేక అలమటిస్తున్నాడు. శ్రీకృష్ణుడు బోధించిన జీవన సత్యాలు ఏ కాలానికైనా, ఏ దేశానికైనా వర్తిస్తాయి. మన ఆలోచనా దృక్పథాన్ని మార్చి, కర్మపై దృష్టి పెట్టేలా చేసే ఆ 7 ముఖ్యమైన జీవన పాఠాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆధునిక జీవితానికి శ్రీకృష్ణుడి 7 పాఠాలు:
శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు పాటిస్తే ఎటువంటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కోవచ్చు. ఆ 7 సూత్రాలు ఇవే..

Advertisement

1. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన (ఫలితాన్ని ఆశించకుండా పని చేయు):
ఆధునిక కాలంలో మనం పని మొదలు పెట్టకముందే లాభం గురించి ఆలోచిస్తాం. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా.. మన అధికారం కేవలం పని చేయడం వరకే ఉంటుంది. ఫలితం మీద కాదు. మనం ఫలితం గురించి అతిగా ఆందోళన చెందితే.. పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది. ఫలితంపై ఆశ వదిలి పని చేస్తే విజయం దానంతట అదే వస్తుంది.

2. మార్పు అనేది ప్రకృతి సహజం:
“ఈ రోజు నీది అనుకున్నది రేపు మరొకరిది అవుతుంది.” జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సుఖం వచ్చినా.. దుఃఖం వచ్చినా అది మారిపోతుందని గ్రహించాలి. ఈ స్పృహ ఉంటే మనిషి ఓటములకు కుంగిపోడు, విజయాలకు విర్రవీగడు.

Advertisement

3. కోపాన్ని నియంత్రించడం:
కోపం మనిషి విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తుంది. కోపం వల్ల గందర గోళం ఏర్పడుతుంది, దాని వల్ల జ్ఞాపకశక్తి దెబ్బతిని మనిషి పతనం అవుతాడు. ఆధునిక కాలంలో ‘యాంగర్ మేనేజ్‌మెంట్’ ఎంత ముఖ్యమో కృష్ణుడు అప్పుడే వివరించాడు. ప్రశాంతమైన మనసుతోనే సరైన నిర్ణయాలు తీసుకోగలం.

4. ఆత్మవిశ్వాసం, మనసుపై నియంత్రణ:
“నీకు నీవే మిత్రుడివి, నీకు నీవే శత్రువువి.” మన మనసు మన అదుపులో ఉంటే అది మనకు గొప్ప మిత్రుడు. లేకపోతే అదే మనకు పెద్ద శత్రువు. ధ్యానం, అభ్యాసం ద్వారా మనసును నియంత్రించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.

5. ధర్మాన్ని పాటించడం:
పరిస్థితులు ఎలా ఉన్నా సరే.. ధర్మం వైపు నిలబడటమే ఉత్తమం. కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పింది కేవలం హింస కోసం కాదు. అన్యాయంపై న్యాయం గెలవాలని. మన వృత్తిలో.. వ్యక్తిగత జీవితంలో నీతిగా ఉండటమే కృష్ణుడు కోరిన ధర్మం.

Also Read: మీ ఇంట్లో సుఖశాంతులు లేవా ? అయితే.. పూజా గదిలో ఈ చిన్న మార్పు చేసి చూడండి !

6. అతి సర్వత్ర వర్జయేత్ :
తినడం, నిద్రపోవడం, వినోదం.. ఏదైనా సరే అతిగా ఉండకూడదు. సమతుల్యత లేని జీవితం రోగాలకి, అశాంతికి దారితీస్తుంది. యోగయుక్తంగా సమతూకంతో జీవించడమే శ్రీకృష్ణుడి మార్గం.

7. వర్తమానంలో జీవించు:
చాలా మంది గతం గురించి బాధపడుతూ లేదా భవిష్యత్తు గురించి భయపడుతూ ప్రస్తుత క్షణాన్ని వృధా చేస్తారు. జరిగిపోయిన దానికి విచారించడం వ్యర్థం. వర్తమానంలో మన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే.. భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×