BigTV English

Lovers Temple: ప్రేమికుల ఆలయం.. పారిపోయి వస్తేనే ఎంట్రీ..!

Lovers Temple: ప్రేమికుల ఆలయం.. పారిపోయి వస్తేనే ఎంట్రీ..!
Lovers Temple

Lovers Temple in Himachal Pradesh: ఇప్పటికీ మన దేశంలో ప్రేమ వివాహం అనే కాన్సెప్ట్‌ను చాలా మంది తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. ఇక కూలాంతర వివాహం అయితే చెప్పనక్కర్లేదు. ఇరు కుటుంబాల నుంచి చాలా సమస్యలను ఎదుక్కోవాల్సి ఉంటుంది. అయితే, ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన ప్రేమ జంటలకు ఆశ్రయం కల్పిస్తోంది ఓ ఆలయం. ప్రేమికుల ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ప్రేమికులకు ఆశ్రయం కల్పించే ప్రేమికుల ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ అందమైన దృశ్యాల మధ్య కులులోని షాంగాడ్ గ్రామంలో ఒక పురాతన శివాలయం ఉంది. ‘షాంగ్చుల్ మహాదేవ్‌’గా ప్రసిద్ధి చెందిన ఈ శివాలయం సుమారు 128 బిఘాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

ఆరునెలలు ఆశ్రయం..
పెద్దలు పెళ్లికి అంగీకరించకపోతే.. ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన ప్రేమ జంటలకు ఈ ఆలయంలో పెళ్లి చేసి, ఆరునెలల పాటు ఆశ్రయం కల్పిస్తారు. ప్రేమ జంటలకు అన్ని సౌకర్యాలు కల్పించి.. కుటుంబీకులు, పోలీసుల నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురవకుండా రక్షణగా నిలుస్తారు.


ఆలయం చరిత్ర..
షాంగ్చుల్ మహాదేవ్ ఆలయం మహాభారత కాలం నాటిదని భావిస్తున్నారు. అగ్యత్యుల కాలంలో పాండవులు ఈ గ్రామానికి వచ్చారు. కౌరవులు వారిని వెంబడించినప్పుడు శివుడు పాండవులను రక్షించాడట, అలాగే ఆలయ సరిహద్దుకు ఎవరు వచ్చినా తానే వారిని రక్షించి, అండగా నిలుస్తానని చెప్పాడట.

పోలీసులకు నో ఎంట్రీ..
ఈ ఆలయంలో పెళ్లి చేసుకున్న ప్రేమికుల ఆరు కుంటుంబాల మధ్య సయోధ్య కుదిరే వరకు ఇక్కడే ఉండొచ్చు. అప్పటి వరకు దంపతులు ఇక్కడే ఉండి భోజనం చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఆలయానికి వచ్చే ప్రేమ జంటల విషయంలో కూడా పోలీసులు జోక్యం చేసుకోలేరు. ఆలయం లోపలికి రావడానికి కూడా అనుమతి లేదు.

Tags

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×