BigTV English

Puttaparthi Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. పుట్టపర్తిలో ఫుల్ స్వింగ్ ఎవరికి ఉంది ?

Puttaparthi Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. పుట్టపర్తిలో ఫుల్ స్వింగ్ ఎవరికి ఉంది ?
AP Updates

Big tv Survey in Puttaparthi Assembly Constituency(AP updates) : ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి పుట్టపర్తి. శ్రీసత్యసాయిబాబా జన్మస్థలం కావడంతో ఆధ్యాత్మిక క్షేత్రంగా పుట్టపర్తి ఉంది. ఇక్కడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రాజకీయంగానూ ప్రాధాన్యం ఉన్న సెగ్మెంట్ ఇది. 2014 దాకా టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత టర్మ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించింది. మరి పుట్టపర్తి నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS

దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి VS పల్లె రఘునాథ్ రెడ్డి


2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య ద్విముఖపోరు నెలకొనగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 57 శాతం ఓట్లు రాబట్టి గెలిచారు. అలాగే టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ లీడర్ పల్లె రఘునాథ్ రెడ్డికి 39 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలవడానికి ప్రధాన కారణం.. ఇదే పుట్టపర్తి సెగ్మెంట్ లో వైసీపీ కీలక నేత, 2014లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సి.సోమశేఖర రెడ్డి సపోర్ట్ ఇవ్వడమే. ఇంకోవైపు నాటి టీడీపీ ప్రభుత్వంపై వచ్చిన సహజ వ్యతిరేకత, పల్లె రఘునాథ్ రెడ్డి వరుసగా గెలిచిన పరిస్థితి ఉండడంతో పుట్టపర్తి ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు. ఈసారి కూడా టీడీపీ, వైసీపీ మధ్య ద్విముఖపోరుకు రంగం సిద్ధమైంది. మరి వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

శ్రీధరన్న పేరుతో సెగ్మెంట్ అంతటా పాదయాత్ర

గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం

ఎన్నికలు దగ్గరపడడంతో గ్రౌండ్ లో యాక్టివ్ అవడం

టిక్కెట్ విషయంలో పెద్దిరెడ్డి సపోర్ట్ ఉండడం

దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి మైనస్ పాయింట్స్

ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వసతులు లేక జనంలో అసంతృప్తి

ప్రధాన రోడ్లు అధ్వాన్నంగా ఉండడం

చిత్రావతి నుంచి ఇసుక మాఫియా ఆగడాలపై జనంలో ఆగ్రహం

సెగ్మెంట్ లో అనుకున్నంత అభివృద్ధి జరగలేదని జనంలో అసంతృప్తి

పుట్టపర్తిలో వైసీపీ క్యాడర్ విడిపోవడం

సి.సోమశేఖర రెడ్డి మరో వర్గంగా పోటీకి వస్తుండడం

సి.సోమశేఖర రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

పుట్టపర్తి జనంలో సోమశేఖరరెడ్డికి మంచి ఇమేజ్

ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం

సి.సోమశేఖర రెడ్డి మైనస్ పాయింట్స్

వైసీపీ టిక్కెట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ

సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేని ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే

పల్లె రఘునాథ్ రెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

సీనియర్ మోస్ట్ లీడర్ గా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు

గతంలో ఐటీ మంత్రిగా పని చేసిన అనుభవం

గత ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి

ప్రజల్లో పల్లె రఘునాథ్ రెడ్డికి మంచి ఇమేజ్

3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం

గత ఎన్నికల్లో ఓడినా జనానికి అందుబాటులో ఉండడం

అన్ని సామాజికవర్గాల మద్దతు ఉండడం

ముఖ్యంగా బలిజ కమ్యూనిటీ సపోర్ట్ ఉండడం

ఇక వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి VS పల్లె రఘునాథ్ రెడ్డి

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పుట్టపర్తిలో టీడీపీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ నుంచి పోటీ చేసే పల్లె రఘునాథ్ రెడ్డికి 48 శాతం ఓట్లు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డికి 46 శాతం ఓట్లు, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు జనం మొగ్గు చూపడానికి కారణం.. మూడుసార్లు పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా అవినీతి ఆరోపణలు లేకపోవడం. జనంలో క్లీన్ ఇమేజ్ ఉండడం ప్రత్యేక కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇక్కడ జనసేన యాక్టివ్ గా లేకపోవడంతో టీడీపీకే సపోర్ట్ ఇవ్వబోతున్నారు. దీంతో జనసేనవైపు ఉండే కమ్యూనిటీలన్నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ఉన్న యాంటీ ఇంక్యుంబెన్సీ కూడా టీడీపీ గెలిచే అవకాశాలను పెంచుతున్నట్లు తేలింది. అలాగే పుట్టపర్తిలో వైసీపీ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యపోరు ఉంది. సోమశేఖరరెడ్డికి టిక్కెట్ రాకపోతే మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇక వైసీపీ ఓట్లు రావడానికి కారణం పెద్ది రామచంద్రారెడ్డి ఎఫెక్ట్, వైసీపీ సర్కార్ పథకాల ద్వారా లబ్దిపొందుతున్న ఓటర్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

సి.సోమశేఖర రెడ్డి VS పల్లె రఘునాథ్ రెడ్డి

మరో సినారియో ప్రకారం పుట్టపర్తిలో వైసీపీ నుంచి సోమశేఖర రెడ్డి, టీడీపీ నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి పోటీ చేస్తే టీడీపీ భారీ మెజార్టీతో గెలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డికి 51 శాతం ఓట్లు, వైసీపీ అభ్యర్థికి 35 శాతం ఓట్లు, ఇతరులకు 14 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. సోమశేఖరరెడ్డి గ్రౌండ్ లో అంతగా యాక్టివ్ గా లేకపోవడం, సోమశేఖర్ రెడ్డికి టిక్కెట్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నప్పటికీ ఒకవేళ వస్తే మాత్రం ప్రస్తుత పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు లేకపోవడం వైసీపీ వెనుకబడడానికి కారణంగా కనిపిస్తున్నాయి.

Related News

Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధిపై.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు సూపర్ న్యూస్.. వారికి దసరా రోజున అకౌంట్లలోకి రూ.15వేలు

Jagan: మళ్లీ దొరికిపోయిన జగన్.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నిజాలు బయటపెట్టిన టీడీపీ

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

Minister Lokesh: రియల్ టైమ్ గవర్నెన్స్‌లో మంత్రి లోకేష్.. నేపాల్‌లో తెలుగువారితో వీడియో కాల్

AP Govt Plan: ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై నో ఆఫీసు, నేరుగా ఇంటికే

Big Stories

×