BigTV English

Lucky Zodiac Signs: 2025లో వీరు పట్టిందల్లా బంగారమే !

Lucky Zodiac Signs: 2025లో  వీరు పట్టిందల్లా బంగారమే !

Lucky Zodiac Signs: అందరూ ఇప్పుడు నూతన సంవత్సరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ జీవితంలో ప్రతి సంవత్సరం మంచి విజయం, సంపద, విలాసం , గౌరవం పొందాలని ప్రతి వ్యక్తి కోరిక. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ప్రతిసారీ, రాబోయే కొత్త సంవత్సరం తమకు ఎలాంటి ప్రత్యేకతను తీసుకురాబోతుందోనని ఉత్సుకతతో ఉంటారు.


వేద జ్యోతిషశాస్త్రంలో, గ్రహాలు , నక్షత్రాల కదలికలను లెక్కించడం ద్వారా వార్షిక జాతకాన్ని తయారు చేస్తారు. దాని ఆధారంగా సంవత్సర ఫలితాలను అంచనా వేస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాబోయే 2025 సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాల రాశులలో మార్పు ఉంటుంది. ఇందులో ప్రధానమైనవి శని, గురు, రాహు-కేతువులు. ఈ ప్రధాన గ్రహాల కదలికలను జ్యోతిష్య శాస్త్రపరంగా విశ్లేషించడం ద్వారా కొన్ని అదృష్ట రాశులను గురించి తెలుసుకోవచ్చు. మీరి 2025 సంవత్సరంలో అదృష్ట రాశులు ఏవో వాటి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి:
జ్యోతిస్య శాస్త్రం ప్రకారం వచ్చే కొత్త సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. 2025 సంవత్సరంలో, ఈ రాశికి చెందిన వ్యక్తులు అన్ని రకాల విజయాలను పొందుతారు. సంపద, గౌరవం పెరుగుదల కనిపిస్తుంది. సంవత్సరం పొడవునా మీకు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరంలో చాలా సార్లు శుభవార్తలు అందుకుంటారు. కొత్త సంవత్సరం రాకతో ఆర్థిక ఇబ్బందులు తొలగడంతో పాటు లాభసాటి అవకాశాలు ఉంటాయి. వైవాహిక, కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.


మిథునరాశి:
మిథునరాశి వారికి రానున్న సంవత్సరం ఆనందంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీ అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి. అంతే కాకుండా పదే పదే విఫలమవుతున్న పనులు 2025 సంవత్సరం ప్రారంభంతో విజయవంతంగా కొనసాగుతాయి. మీరు సంవత్సరం పొడవునా అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు. చాలా మంది వ్యక్తులు తమ జీవితంలో విశ్వాసం, గౌరవం, సానుకూల మార్పులను చూస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా రాబోయే సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

మకర రాశి:
మకర రాశి వారికి కొత్త సంవత్సరం విజయాన్ని చేకూరుస్తుంది. 2025 లో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అంతే కాకుండా సంవత్సరం పొడవునా మనస్సు సంతోషంగా ఉంటుంది. మీరు భూమి, ఆస్తి , వాహన సంతోషాన్ని పొందుతారు. మీ నెరవేరని కలలు ఖచ్చితంగా 2025 సంవత్సరంలో నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు కొత్త , అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో నిరంతర లాభాలు, మంచి విజయాలు అందుతాయి. సౌఖ్యాలను పెంచి విలాసాలు అనుభవించే సంవత్సరం ఇది.

కుంభ రాశి:
కుంభ రాశి వారికి 2025 సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా అనేక విజయాలతో నిండి ఉంటుంది. రాబోయే 2025 సంవత్సరం మీకు చాలా అదృష్టంగా ఉంటుంది. జీవితంలో చాలా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చి గతం కంటే మెరుగైన స్థితిలో ఉంటుంది. మనసు ఆనందంగా ఉంటుంది. అంతే కాకుండా కుటుంబంలో ఆనందం కొనసాగుతుంది. ఆరోగ్య పరంగా 2025 సంవత్సరం బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం మీకు అదనపు లాభాలు వచ్చేలా ఉంటుంది.

Also Read: నవపంచమ రాజయోగం.. వీరికి అదృష్టం

మీన రాశి:
మీన రాశి వారికి 2025 సంవత్సరం బాగా విజయాలతో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఇల్లు , వాహన సంతోషాన్ని పొందుతారు. మీరు మీ కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఒకదాని తర్వాత ఒకటి విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలకు అవకాశాలు పెరుగుతాయి . అంతే కాకుండా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీరు కొత్త ఉద్యోగానికి మంచి అవకాశాలు పొందుతారు. మీన రాశి వారు 2025 సంవత్సరంలో అదృష్ట రాశుల్లో ఒకటి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×