Unstoppable with NBK: శ్రీలీల (Sree Leela).. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో జెడ్ స్పీడ్ లో దూసుకుపోతోంది. నిన్న మొన్నటి వరకు ఈమె దూకుడుకి కాస్త బ్రేక్ పడ్డా .. ఇప్పుడు మాత్రం వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే సుకుమార్(Sukumar), అల్లు అర్జున్(Allu Arjun)కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2(Pushpa 2) సినిమాలో ఐటమ్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ ముద్దుగుమ్మ. ఈ పాటతో భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడం తో పాటూ డ్యాన్సింగ్ క్వీన్ అని అనిపించుకుంది శ్రీలీల.
బాలయ్య షోలో సందడి చేసిన శ్రీలీల..
మరొకవైపు తమిళ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ‘అమరన్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు శివ కార్తికేయన్ (Shiva Karthikeyan). ఏ.ఆర్ మురగదాస్(AR Muragadas)డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే లేడీ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాకి శ్రీ లీల హీరోయిన్గా ఫైనల్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు నవీన్ పోలిశెట్టి (Naveen polishetty) తో కలిసి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే (Unstoppable with NBK) కార్యక్రమానికి హాజరయ్యింది..
అన్ స్టాపబుల్ షోలో వీణ వాయించి అబ్బురపరిచిన శ్రీలీల..
తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా ముగించారు అన్ స్టాపబుల్ మేకర్స్. షూటింగ్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా ఆహా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇక ఈ స్టేజ్ పై గుంటూరు కారం సినిమాలోని “కుర్చీ మడత పెట్టి” సాంగ్ కి స్టెప్పులేసినట్లు సమాచారం. అంతేకాదు శ్రీ లీలా డాన్స్ తో పాటు వీణ వాయించడంలో కూడా ప్రావీణ్యం కలిగి ఉందని తాజాగా అందరికీ తెలిసింది. బాలయ్య అను స్టాపబుల్ స్టేజ్ పైన వీణ వాయించి తన టాలెంట్ ను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇకపోతే శ్రీలీల టాలెంట్ ని చూసి అన్ స్టాపబుల్ హోస్ట్ బాలకృష్ణ (Balakrishna) తో పాటు ఆడియన్స్ కూడా శ్రీ లీల నీలో మస్త్ షేడ్స్ ఉన్నాయే అంటూ కితాబు ఇస్తున్నారు. వీణ వాయించిన తర్వాత చప్పట్లతో హోరెత్తించారు ఆడియన్స్. ఇక ఎపిసోడ్ వచ్చే వారం విడుదల కానుండగా.. శ్రీ లీలాకు సంబంధించిన ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
గొప్ప మనసు చాటుకున్న శ్రీ లీల..
ఇకపోతే శ్రీలీల మరొకవైపు వైద్య విద్యను అభ్యసిస్తున్న విషయం తెలిసిందే. తన చదువు పూర్తయిన వెంటనే పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించే విధంగా ఆలోచనలు చేస్తోందట ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు యుక్త వయసుకు వచ్చిన వెంటనే, ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా దత్తత తీసుకొని, వారిని చదివిస్తూ ఆలనా పాలన చూసుకుంటున్నట్లు సమాచారం.. ఇక కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినా తెలుగులో భారీ పాపులారిటీ సొంతం చేసుకొని, తనలోని టాలెంట్ ను అందరికీ పరిచయం చేస్తూ.. మరింత క్రేజ్ దక్కించుకుంటుంది శ్రీ లీల. ఏదిఏమైనా శ్రీలీలా టాలెంట్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.