Niharika Konidela: నేడు రాఖీ పౌర్ణమి(Rakhi Pournami) కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలను జరుపుకుంటున్నారు. తమ సోదరులకు రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిహారిక(Niharika) సైతం తన అన్నయ్యలతో కలిసి ఈ రాఖీ వేడుకలను జరుపుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. తన అన్నయ్య వరుణ్ తేజ్ (Varun Tej) అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ramcharan Tej)ఇద్దరికీ కూడా ఈమె రాఖీ కట్టారని తెలుస్తుంది.
అన్నయ్యలకు రాఖీ కట్టిన నిహారిక..
ఇలా రాఖీ కట్టిన అనంతరం వారితో కలిసి దిగిన ఫోటోలను నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… తోబుట్టువుల చిరునవ్వులతో పండుగ వాతావరణం నెలకొంది. ఈ రాఖీ పండుగను తన అన్నయ్యలతో కలిసి జరుపుకోవడం వల్ల మరింత ప్రేమను, ఐక్యతను ఫీలవుతున్నాను అంటూ ఈమె చెప్పుకువచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వీటిని మరింత వైరల్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు..
నిహారిక విషయానికి వస్తే.. నాగబాబు వారసురాలిగా ఈమె యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోయిన్ గా నిహారిక దాదాపు మూడు సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె నటించిన సినిమాలు ఏవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇలా వెండితెరపై నిహారిక సక్సెస్ అందుకొని నేపథ్యంలో ఈమె పెద్దలు చూసిన అబ్బాయిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. కానీ తన వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదు. ప్రస్తుతం తన భర్తకు విడాకులు(Divorce) ఇచ్చిన నిహారిక తిరిగి ఇండస్ట్రీలో నిర్మాతగా, నటిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈమె నిర్మాతగా తన రెండో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదివరకే కమిటీ కుర్రాళ్ళు(Kamitti Kurrollu) అనే సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది.
మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన నిహారిక..
ఇలా ఈ సినిమాకు భారీ స్థాయిలో లాభాలు రావడమే కాకుండా ఎన్నో అవార్డులు కూడా లభించాయని చెప్పాలి. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది (Peddi)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వరుణ్ తేజ్ కూడా ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఎంతో విభిన్నమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరుణ్ తేజ్ కు సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పాలి. ఇటీవల కాలంలో మెగా కుటుంబం నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయని చెప్పాలి. ఇక త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర సినిమా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా