BigTV English

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Weather News:  రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Weather News: హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. మూడు రోజుల క్రితం భాగ్యనగరంలో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి యూసఫ్ గూడ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీల్లో బైకులు, కారులు వరదల్లో సైతం కొట్టుకుపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి కూడా భారీ వర్షం పడింది. చాలా చోట్ల రహదారులపై వరద నీరు నిలిచిపోయింది. పాతబస్తీ, చార్మినార్, చాంద్రాయణ్ గుట్ట, బహదూర్ పూరా, గౌలిగూడా, శాలిబండ, సైదాబాద్, మలక్ పేట్, చాదర్ ఘాట్, యూసుఫ్ గూడ, అమీర్ పేట, తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమైంది. నగరవాసులన ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తోంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడింది.


మరో మూడు రోజులు భారీ వర్షాలు..

ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మరోసారి అలర్ట్ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా మళ్లీ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులో కూడిన వానలు పడతాయని హెచ్చరిచ్చింది. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ రూట్‌లో వెళ్లేవారికి ముఖ్య గమనిక..

మరోవైపు.. హిమాయత్ సాగర్ నీటిమట్టం భారీ పెరగడంతో రహదారులపైకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద వరద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. అక్కడ బారికేడ్స్ ను ఏర్పాటు చేశారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వెళ్లే వాహనదారులు దీన్ని గమనించి వేరే రూట్ లో వెళ్లాలని పోలీసులు సూచించారు..

ఈ జిల్లాల్లో దంచుడే దంచుడు..

మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నెల 13న మరోసారి బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆగస్టు నెల అంతా భారీ వర్షాల పడే ఛాన్స్ ఉంది..

పిడుగుల పడే అవకాశం.. జాగ్రత్త..!

భారీ వర్షాల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం వేళల్లో పొలాల వద్దకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ALSO READ: Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

Related News

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో బిగ్ రిలీఫ్.. గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Big Stories

×