Bollywood: రక్షాబంధన్.. దేశ విదేశాలలో కూడా చాలామంది హిందూ సాంప్రదాయం ప్రకారం ఈరోజు రక్షాబంధన్ జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు తమ బంధాలను మరింత బలపరుస్తూ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. ఇక ఇలాంటి రక్షాబంధన్ వేళ కన్నీళ్లు పెట్టిస్తూ తన భావోద్వేగాలను పోస్టు రూపంలో పంచుకుంది దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) సోదరి శ్వేత (Swetha). ఇక ఆమె పోస్ట్ చూస్తుంటే ఎంతటి వారైనా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. మరి ఈ రక్షాబంధన్ వేళ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేత తన అన్నయ్యను గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
కన్నీళ్లు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి పోస్ట్..
తాజాగా శ్వేత తన అన్నయ్యను గుర్తు చేసుకుంటూ ఈ విధంగా పోస్ట్ పెట్టింది. ” కొన్నిసార్లు నువ్వు నిజంగా ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళనట్లు అనిపిస్తుంది. ఇంకా నువ్వు ఇక్కడే నాతోనే ఉన్నావా?.. నేను నిజంగా నిన్ను మళ్ళీ చూడలేనా? నీ నవ్వు కేవలం ప్రతిధ్వనిగా మిగిలిపోతుందా? నా హృదయంలో నీకెప్పుడూ రాఖీ కడుతూనే ఉంటాను..” అంటూ బరువెక్కిన గుండెతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన పోస్ట్ షేర్ చేసింది శ్వేత. ప్రస్తుతం శ్వేతా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు నెటిజన్లు శ్వేతా పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి అని ఆమెకు సలహా ఇస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కెరియర్..
బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ఈతరం నటులలో ప్రతిభావంతుడిగా పేరు సొంతం చేసుకున్నారు సుశాంత్.. 1986 జనవరి 21న బీహార్ పాట్నాలో జన్మించారు. ఈయన తండ్రి పేరు కృష్ణ కుమార్ సింగ్, తల్లి పేరు ఉష సింగ్. వీరి తల్లిదండ్రులకు 6 మంది సంతానం.. కాగా ఐదుగురు అమ్మాయిలు, ఒక కుమారుడు కావడం గమనార్హం. ఇకపోతే ఈయనకు గుల్హన్ అనే మరో పేరు కూడా ఉంది. ఇక ఈయన సోదరీమణులలో ఒకరైన మితు సింగ్ రాష్ట్రస్థాయి క్రికెట్లో పేరు తెచ్చుకుంది. సెయింట్ కరెన్స్ హైస్కూల్లో చదువుకున్నారు. సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించారు. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు టెలివిజన్ రంగంలో కూడా సత్తా చాటిన ఈయన.. అతి చిన్న వయసులోనే మరణించడం నిజంగా బాధాకరమని చెప్పాలి
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం..
2020 జూన్ 14న ముంబైలోని బాంద్రాలో తన ఇంట్లో 34 సంవత్సరాల వయసులోనే మరణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఈయనకు బైపోలార్ డిజార్డర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఊపిరాడక మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించినా.. స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో దీనిని ఆత్మహత్య కేసు కిందే పరిగణించారు. ఈయన కుటుంబం రియా చక్రవర్తి మరో అయిదుగురిపై ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపిస్తూ కోర్టులో కేసు వేయగా .. కొన్నేళ్ల విచారణ తర్వాత రియా చక్రవర్తి నిర్దోషిగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Also read: Bad Girlz : స్టేజ్‌పైనే బట్టలు విప్పేసిన హీరోయిన్లు… వామ్మో అసలు వీళ్లకు ఈ థాట్ ఎలా వచ్చిందో ?