Faisal Khan Shocking Comments on Brother: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పై ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశాడు. తన అన్నయ్యతో ఎంతోకాలంగా గొడవలు ఉన్నాయని, తనని ఏడాది పాటు గదిలో బంధించి డ్రగ్స్ ఇచ్చాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటుడిగా, నిర్మాతగా ఆమిర్ బి టౌన్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. వెండితెరపై తనదైన నటన, విభిన్న పాత్రలతో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు పొందాడు.
ఆమిర్ తో గొడవలు..
ఈ మధ్య మూడో పెళ్లి, నటితో డేటింగ్ వార్తలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న ఆమిర్ పై ఆయన సోదరుడు ఫైసల్ తాజాగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. ఆమిర్, ఫైసల్ మధ్య ఎంతోకాలంగా విభేదాలు ఉన్నాయి, ఆస్తి విషయంలో ఫైసల్ అన్నయ్యతో న్యాయ పోరాటం చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆమిర్ తో ఉన్న గొడవలపై పెదవి విప్పాడు. అంతేకాదు ఆమిర్, తన కుటుంబం వల్ల తన ఎంతగా బాధపడ్డాడో గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘మా అన్నయ్యతో నాకు ఎంతో కాలంగా విభేదాలు ఉన్నాయి. నన్ను పిచ్చోడిని చేశారు. నాకు మానసిక వ్యాధి ఉందని అందరిని నమ్మించారు.
పిచ్చోడిననే ముద్ర వేశారు
నేను పిచ్చోడినని, నా వల్ల సమాజానికి హాని జరుగుతుందని అసత్య ప్రచారం చేశారు. నా మానసిక పరిస్థిత బాగా లేదని నన్ను ఏడాది పాటు గదిలో బంధించారు. కొన్ని విషయాల్లో నేను నా కుటుంబానికి సహకరించకపోవడంతో నాపై పిచ్చోడనే ముద్ర వేశారు. మా అన్నయ్య ఆమిర్ నన్ను గదిలో బంధించాడు. ఏవేవో మందులు ఇచ్చి.. చిత్ర హింసలు పెట్టారు. నేను బయటకు రాకుండ బయట బాడీగార్డ్స్ ని పెట్టారు. అలా ఏడాది పాటు గదిలోనే బంధీగా ఉన్న. వీరి నుంచి నా తండ్రి నన్ను కాపాడతాడని అనుకున్నా. కానీ, ఆయనతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నా ఫోన్ లాక్కున్నారు. ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండ చేశారు’ అంటూ ఆవేదన చెందాడు. ఆ తర్వాత సంవత్సరం తర్వాత తనని వేరే ఇంటికి మార్చారని చెప్పాడు.
అయితే తన అన్నయ్య మంచివాడే కానీ, ఆయన చూట్టు ఉన్నవాళ్లు తనని మార్చరని అన్నాడు. ఆయన స్నేహితులు, సన్నిహితుల వల్ల ఆమిర్ తననతో అల ప్రవర్తించేవాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆస్తి విషయంలో తన అన్నయ్య, తనకి మధ్య న్యాయ పోరాటం జరుగుతుందన్నాడు. కాగా ఆమిర్, ఫైసల్ లు 2000 వచ్చిన మేళ అనే సినిమాలో కలిసి నటించారు. ధర్మేశ్ దర్శన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 1988లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఫైసల్. మొదట విలన్ పాత్రలో కెరీర్ ప్రారంభించాడు. 1990 లో తన తండ్రి నటించిన తుమ్ మేరే హో చిత్రానికి దర్శకత్వం వహించాడు. అలా హిందీలో పలు సినిమాలు చేసిన ఫైసల్ గాయకుడిగా కూడా మంచి గుర్తింపు పొందాడు.
Also Read: SSMB29 Firts Look: ఓర్నీ రాజమౌళి మళ్లీ కాపీ కొట్టాడు కదా… ఏకంగా పవన్ కళ్యాణ్‌నే టచ్ చేశాడు