E-Paper
Advertisement

Lucky Zodiac Signs: సెప్టెంబర్‌లో ఈ రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయ్ !

Lucky Zodiac Signs: సెప్టెంబర్‌లో ఈ  రాశుల వారు అనుకున్నవన్నీ జరుగుతాయ్ !

September 2024  Lucky Zodiac Signs: గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశులను మార్చుకుంటున్నాయి. గ్రహాల రాశి మార్పు కారణంగా 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. మరి కొన్ని రాశులకు రాశి మార్పు అశుభ ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా సెప్టెంబర్ బుధుడు, శుక్రుడు, సూర్య గ్రహాలు తమ రాశులను మార్చుకోనున్నాయి. ఈ గ్రహాల స్థానాల మార్పు అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది.

మేష రాశి: సెప్టెంబర్ నెల మేష రాశి వారికి కలసి వస్తుంది. మీరు ఈ నెలలో చాలా శుభ వార్తలను వింటారు. ధన సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. బంధు మిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. అంతే కాకుండా ఉద్యోగలకు పదోన్నతులు లభిస్తాయి. జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మీ సౌకర్యాలు పెరిగుతాయి. ఆఫీసుల్లో కూడా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.

సింహ రాశి: సెప్టెంబర్‌లో సింహ రాశి వారికి అదృష్టం కలసివస్తుంది. మీకు ఈ సమయంలో కుటుంబ సభ్యుల నుంచి మద్ధతు లభిస్తుంది. చిరకాల కోరికలు కూడా నెరవేరతాయి. వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకుంటారు. అంతే కాకుండా వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు. మీరు మీ భాగస్వామితో మంచి సమయాలన్ని గడుపుతారు. కోర్టు సంబంధిత విషయాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది.

కన్య రాశి: సెప్టెంబర్ లో కన్య రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమాజంలో విలువ, గౌరవం పెరుగుతాయి. అంతే కాకుండా మంచి జీతంతో ఉద్యోగాలు లభిస్తాయి. మీరు ఈ నెలలో చాలా శుభ వార్తలు వింటారు. ఆఫీసుల్లో మీరు చేసే పనులు త్వరగా పూర్తవుతాయి. ఉన్నతాధికారులు మీ పనులను మెచ్చుకుంటారు. వ్యాపారులకు మంచి లాభాలు కూడా వస్తాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: వీరిపై బుధుడి ప్రభావం.. ఆగస్టు 28 నుంచి సమస్యలు తప్పవు

మీన రాశి: సెప్టెంబర్ నెలలో మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న పనులు పూర్తవుతాయి. అంతే కాకుండా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీరు ఈ నెలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఈ నెలలో చేసే పనుల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా ఈ నెల మీకు కలసి వస్తుంది.

కర్కాటక రాశి: కుటుంబంలో మీ బాధ్యత పెరుగుతుంది. స్నేహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగస్థులు పనుల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు చదువుపై ద్యాస పెట్టడం మంచిది. మీ మార్గదర్శకాలు కొందరికి అవసరం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్లేందుకు ఇది మంచి సమయం. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నతాధికారులు మిమ్మల్ని అభినందిస్తారు. కొన్ని విషయాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×