Weight Loss Tips: బరువు తగ్గడం అనేది చాలామందికి ఒక సవాలు అనే చెప్పాలి. ముఖ్యంగా హార్మోన్లలో మార్పులు, జీవక్రియ రేటులో తేడాల వల్ల మహిళలకు బరువు తగ్గడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే.. నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మాత్రం మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా ప్రతి రోజు ఉదయం పూట వ్యాయామంతో పాటు పక్కా డైట్ పాటిస్తే కూడా ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈజీగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈజీగా బరువు తగ్గడానికి చిట్కాలు :
1. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం:
ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం. ఇది కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. అంతే కాకుండా జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. రోజూ సరిపడా ప్రోటీన్ తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా అనవసరమైన స్నాక్స్ తినకుండా ఉంటారు. పప్పులు, గుడ్లు, చికెన్, చేపలు, పాల ఉత్పత్తులు వంటివి కూడా ఆహారంలో తగినంత చేర్చుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.
2. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం:
ఫైబర్ ఉన్న ఆహారం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు తక్కువగా తినే అవకాశం కూడా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్ వంటివి మీ డైట్‌లో చేర్చువడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది.
3. తగినంత నీరు తాగండి:
నీరు శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా కేలరీలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల తక్కువగా తింటారు. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడానికి ప్రయత్నించండి.
4. వ్యాయామం తప్పనిసరి:
కేవలం ఆహారంపై నియంత్రణ పెట్టడం మాత్రమే కాకుండా.. రోజూ వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం. కార్డియో (రన్నింగ్, వాకింగ్) స్ట్రెంగ్త్ ట్రైనింగ్ (బరువులు ఎత్తడం) కలపడం వల్ల కండరాలు పెరుగుతాయి. ఫలితంగా కొవ్వు కూడా తగ్గుతుంది.
5. మంచి నిద్ర చాలా అవసరం:
నిద్ర లేకపోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. నిద్ర తక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది ఆకలిని పెంచుతుంది. అందుకే ప్రతి రోజు 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.
Also Read: డైలీ స్ట్రాబెర్రీలు తింటే.. శరీరంలో జరిగే మార్పులివే !
6. చిన్న ప్లేట్లు వాడండి:
చిన్న ప్లేట్లలో ఆహారం తీసుకోవడం వల్ల క్వాంటిటీ తగ్గించవచ్చు. తద్వారా కేలరీలు తక్కువగా తీసుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఇది తక్కువగా తినేలా చేస్తుంది.
7. ఒత్తిడిని తగ్గించుకోండి:
ఒత్తిడి వల్ల ఒబేసిటీ, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు వంటివి చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
8. స్నాక్స్ తెలివిగా ఎంచుకోండి:
అనారోగ్యకరమైన స్నాక్స్ బదులుగా పండ్లు, సీడ్స్, గుమ్మడి గింజలు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఎంచుకోండి.
9. క్రమం తప్పకుండా తినండి:
రోజుకు మూడు పూటలా చాలా కొంచెం కొంచెంగా సమయానికి తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా ఆకలి నియంత్రణలో ఉంటుంది