E-Paper
Advertisement

Mars Transit: అంగారకుడి సంచారం.. అక్టోబర్ వరకు ఈ రాశుల వారికి అన్నీ లాభాలే !

Mars Transit: అంగారకుడి సంచారం.. అక్టోబర్ వరకు ఈ రాశుల వారికి అన్నీ లాభాలే !

Mars Transit: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. కుజుడు శక్తి, ధైర్యానికి కారకుడని అంటారు. కుజుడు ఆగస్టులో తన రాశి మార్చుకోనున్నాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో కుజుడు సంచరిస్తున్నాడు. ఆగస్టు 26 మధ్యాహ్నం 03:40 గంటలకు కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశికి అధిపతి బుధుడు అయితే అక్టోబర్ 19 2024 వరకు కుజుడు మిథున రాశిలో ఉండి అక్టోబర్ 20 మధ్యాహ్నం 2:40 గంటలకు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

కుజుడు ఒక రాశిలో 45 రోజులపాటు సంచరిస్తాడు. అంగారకుడి సంచారం కర్కాటక, మకర రాశులతో సహా కొన్ని రాశుల వారికి అపారమైన విజయాన్ని తెస్తుంది. అంతే కాకుండా సంపదను కూడా పెంచుతుంది. బుధుడి సంచారం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి అంగారకుడి సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ ప్రభావం కారణంగా కొత్త ఆదాయ మార్గాలు మీ ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. మీ ఆదాయం పెరిగే కొద్దీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆస్తిపై పెట్టుబడులకు ఇది మంచి సమయం. వ్యాపారులకు పాత పెట్టుబడులతో మంచి రాబడులు కూడా వస్తాయి. పనికి తగిన ప్రశంసలు అందుకుంటారు. గౌరవం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో కుటుంబంలో శాంతి, సంతోషాలు కూడా పెరుగుతాయి.
సింహ రాశి:
సింహ రాశి వారికి అంగారకుడి సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అదృష్టానికి పూర్తి మద్దతు కలుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి లభిస్తుంది. ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇది విద్యార్థులకు మంచి సమయం అని చెప్పాలి. ఉద్యోగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది. విదేశాలకు కూడా వెళ్తారు. జీవిత భాగస్వామికి నుంచి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం అని చెప్పాలి.

Also Read: ఈ రాశుల వారికి ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి లాభాలు రాబోతున్నాయి..

మకర రాశి:
మకర రాశి వారు కుజుడు సంచారం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. కుజుడి అనుగ్రహం వల్ల మీ సుఖాలు, సౌకర్యాలు కూడా పెరుగుతాయి. భూమి, భవనం, వాహన కొనుగోలులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. మీరు మీ పిల్లల నుంచి శుభవార్తలు పొందుతారు. ధన ప్రవాహం కూడా భారీగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. అంతే కాకుండా పలు విషయాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించడం మంచిది. వృత్తి జీవితం వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించాలి. మీ మొదటి ప్రాధాన్యత పనిపై పెట్టడం మంచిది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×