E-Paper
Advertisement

Ram Pothineni – Harish Shankar: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై హరీష్ శంకర్‌ ట్వీట్.. హీరో రామ్ సాలిడ్ రిప్లై!

Ram Pothineni – Harish Shankar: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై హరీష్ శంకర్‌ ట్వీట్.. హీరో రామ్ సాలిడ్ రిప్లై!
Advertisement

Ram Pothineni – Harish Shankar – Double Ismart Movie: టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి గతం కంటే ఇప్పుడే ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలు ఎప్పటికప్పుడు రిలీజ్ అయి ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి సమయంలోనే సినిమా, సినిమాకు మధ్యన క్లాస్ ఏర్పడుతుంది. ఫలితంగా కొన్ని వివాదాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికీ చాలా బడా సినిమాల మధ్యన అలాంటి చిక్కులే వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితే టాలీవుడ్‌లో ఏర్పడింది.

ఈ నెల (ఆగస్టు)లో చాలా సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. అందులో రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ ఉన్నాయి. ఈ రెండు సినిమాలు ఆగస్టు 15న రిలీజ్ కానున్నాయి. దీంతో ఇప్పటికే ఇరు సినిమాల మధ్య చిన్న చిన్న వివాదాలు జరుగుతున్నట్లు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇక ఇప్పుడు హీరో రామ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ మధ్యన జరిగిన ట్వీట్ల సంభాషణ ఆసక్తికరంగా మారింది. అదేంటనే విషయానికొస్తే..

Advertisement

రామ్ పోతినేని హీరోగా క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీ కౌర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమా కోసం యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్‌ను మరో రెండు రోజుల్లో రిలీజ్ చేయనున్నారు.

Also Read: ఇస్మార్ట్ స్టెప్పులతో ‘స్టెప్ప మార్’ సాంగ్ అదిరింది.. ఏంటా జోష్ భయ్యా..

Advertisement

మరోవైపు హరీశ్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఆకలితో ఉన్న రవితేజకు ఈ సినిమా మంచి హిట్ అందిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇందులో అతడు ఇన్‌కం టాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. దీంతో ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానుండటంతో ఏ సినిమా చూడాలో తెలియక ప్రేక్షకులు తికమకపడుతున్నారు.

మరోవైపు తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దర్శకుడు హరీశ్ శంకర్ తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ గురించి చేసిన ఓ ట్వీట్‌కి రామ్ పోతినే రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ‘‘పూరీ జగన్నాథ్ సర్ క్రియేట్ చేసిన మ్యాజికల్ క్యారెక్టర్‌లో రామ్‌ ఎనర్జీని చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. దీనికి రామ్ రిప్లై ఇస్తూ.. ‘‘ధన్యవాదాలు.. మీరు కూడా అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వీరిద్దరి ట్వీట్లు నెట్టింట వైరల్‌గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×