E-Paper
Advertisement

Gemstones: అదృష్టాన్ని మార్చే రత్నాలు.. కెరీర్, బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే ఇవి ధరించాల్సిందే !

Gemstones: అదృష్టాన్ని మార్చే రత్నాలు.. కెరీర్, బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే ఇవి ధరించాల్సిందే !
Advertisement

Gemstones: చాలా మంది ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదని, అదృష్టం కలిసి రావడం లేదని బాధపడుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మన గ్రహ గతులు మన ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. బలహీనంగా ఉన్న గ్రహాలను బలపరిచి, ధన యోగాన్ని పెంచడానికి రత్న ధారణ ఒక అద్భుత మార్గం. కేవలం అందం కోసమే కాకుండా.. విశ్వంలోని సకల శక్తిని ఆకర్షించి మన జీవితంలోకి సంపదను ఆహ్వానించే ఆ రత్నాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ధనవంతులు కావాలా? అదృష్టాన్ని తెచ్చే రత్నాల రహస్యాలివే..
రత్న శాస్త్రం అనేది వేల ఏళ్లుగా వస్తున్న నమ్మకం. ప్రకృతిలో లభించే అరుదైన మణులకు గ్రహాల కిరణాలను స్వీకరించి.. మన శరీరంలోకి ఆ శక్తిని పంపే గుణం ఉంటుంది. ధనవంతులు కావాలన్నా.. వ్యాపారంలో లాభాలు రావాలన్నా కొన్ని ప్రత్యేక రత్నాలు విశేష ఫలితాలను ఇస్తాయి.

Advertisement

1. కనక పుష్యరాగం:
సంపదకు, జ్ఞానానికి అధిపతి అయిన ‘గురువు’కు ఈ రత్నం ప్రీతిపాత్రమైనది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో.. అంతే కాకుండా పెళ్లిళ్లు కావడం లేదో వారికి ఇది మేలు చేస్తుంది. ఈ రత్నాన్ని ధరించడం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా బంగారం లేదా వెండి ఉంగరంలో చూపుడు వేలుకు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

2. వజ్రం:
లగ్జరీ లైఫ్ కావాలనుకునే వారికి వజ్రం బెస్ట్ ఆప్షన్. ఇది శుక్రుడికి సంబంధించినది. శుక్రుడు అనుగ్రహిస్తే కారు, ఇల్లు, విలాసవంతమైన జీవితం సొంతమవుతాయి. కళాకారులు, ఫ్యాషన్ రంగంలో ఉన్నవారు వజ్రం ధరిస్తే మరింత పేరు ప్రఖ్యాతులు, ధనం వస్తాయి. అయితే వజ్రం అందరికీ పడదు. అందుకే జాతక విశ్లేషణ తప్పనిసరి.

Advertisement

3. పచ్చ :
వ్యాపారస్తులకు.. సేల్స్ రంగంలో ఉన్నవారికి ‘పచ్చ’ ఒక వరం. ఇది బుధ గ్రహానికి సంబంధించినది. బుధుడు బుద్ధికి, వ్యాపారానికి కారకుడు. దీన్ని ధరించడం వల్ల తెలివితేటలు పెరిగి, లాభదాయకమైన నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్‌లో ఉన్న వారికి పచ్చ బాగా సూట్ అవుతుంది.

4. మాణిక్యం:
రాజ్యాధికారం, కీర్తి ప్రతిష్టలు కావాలనుకునే.. వారికి మాణిక్యం అద్భుతంగా పని చేస్తుంది. ఇది సూర్యుడికి సంబంధించిన రత్నం. సూర్యుడు బలంగా ఉంటే సమాజంలో గౌరవం, ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారు లేదా రాజకీయాల్లో ఉన్నవారు దీన్ని ధరిస్తే.. ధనంతో పాటు హోదా కూడా పెరుగుతుంది.

5. నీలం:
ఇది శని గ్రహానికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన రత్నం. నీలం అందరికీ పడదు.. కానీ పడితే మాత్రం పేదవాడిని కూడా రాత్రికి రాత్రే ధనవంతుడిని చేయగలదు. ఇది చాలా వేగంగా ఫలితాలను ఇస్తుంది. భూమికి సంబంధించిన వ్యాపారాలు, ఇనుము, ఆయిల్ బిజినెస్‌లో ఉండేవారికి ఇది ధన వర్షం కురిపిస్తుంది.

Also Read: ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఫోటోలు పెడితే దరిద్రం వెనక్కి పోవాల్సిందే!

రత్నాలు ధరించే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి:

నాణ్యత: సహజమైన రత్నాలు మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. గాజు ముక్కలు లేదా ప్లాస్టిక్ రత్నాలు పని చేయవు.

జాతక పరీక్ష: మీ జన్మ నక్షత్రం, లగ్నం, ప్రస్తుతం నడుస్తున్న దశా దిశలను బట్టి ఏ రత్నం ధరించాలో నిపుణులైన జ్యోతిష్కులను అడిగి తెలుసుకోవాలి. లేదంటే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

బరువు: మీ శరీర బరువును బట్టి ఎన్ని క్యారెట్ల రత్నం ధరించాలో నిర్ణయించాలి.

కష్టపడటం మన వంతు అయితే.. ఆ కష్టానికి అదృష్టం తోడవ్వడానికి రత్న శాస్త్రం సహకరిస్తుంది. సరైన రత్నాన్ని, సరైన పద్ధతిలో ధరిస్తే.. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఐశ్వర్యవంతులు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×