BigTV English

Narada Maharshi: బ్రహ్మచారి నారద మునికి 50 పెళ్లిళ్లు అయ్యాయని మీకు తెలుసా..?

Narada Maharshi: బ్రహ్మచారి నారద మునికి 50 పెళ్లిళ్లు అయ్యాయని మీకు తెలుసా..?

Narada Maharshi: నారదుడికి పెళ్లైందని తెలుసా..? ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 50 పెళ్లిళ్లు చేసుకున్నాడని మీకు తెలుసా..?  సంసార సాగరంలో ఆయన ఈదారని తెలుసా..? పిల్లా పాపలతో గృహస్థు జీవితాన్ని గడిపాడని తెలుసా..? అసలు నారదుడు పెళ్ళి చేసుకోవడం ఏంటి..? బ్రహ్మచారిగా పిలవడబటమేంటి..? ఈ కథనంలో తెలుసుకుందాం.


త్రిలోక సంచారి అయిన నారదుడి గురించి తెలియని వారు లేరు. తెలుగు సినిమాల్లో అయితే ఏకంగా నారద మహర్షిని కామెడీ పాత్రలకు మాత్రమే పరిమితం చేశారు. కానీ ఆయన సృష్టి, స్థితి, లక కారులైన త్రిమూర్తులకే కాదు కోటాను కోట్ల దేవతలకు ఎన్నో రకాలుగా సాయం చేశాడు. లోకంలో ఎన్ని సమస్యలు వచ్చినా నారద ముని  పరిష్కరించే వాడు.  రాక్షసుల నుంచి దేవతలను కాపాడినా.. రాముడి చేత రావణున్ని చంపించినా నారదుడికే చెల్లింది. యుగం ఏదైనా యుద్దం ఏదైనా అందులో నారదుడి పాత్ర ఉండాల్సిందే.. దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం ఆయన తన వంతు కృషి చేయాల్సిందే. అన్నింటికీ మించి ఆయనొక అద్బుతమైన దూత.

సంధి నెరపడంలోనూ.. సయోధ్య కుదర్చడంలోనూ నారదుడిని మించిన ఘనాపాటి లేడనే చెప్పుకోవచ్చు. ఇక దేవతల  శత్రువలైన రాక్షసులతో మిత్రత్వం నెరపడంలోనూ వారిని కాపాడినట్టే కాపాడి.. వారి నాశనానికి వారినే కారకులుగా చేయడంలోనూ నారద మహర్షిది  అందె వేసిన చేయే అని చెప్పాలి. అయితే ఇప్పటికీ ఎవరైనా గొడవలు పెట్టే మనుషులు కనిపిస్తే నారదుడు అని బిరుదు ఇస్తూ అవహేళనగా చూస్తున్నారు కానీ నారద ముని గొప్పతనం ఎవ్వరికీ తెలియడం లేదు అయితే తాను నమ్మిన సిద్దాంతం కోసం ఏకంగా సృష్టి కర్త అయిన బ్రహ్మతోనే గొడవ పెట్టుకున్న గొప్ప సిద్దాంతకర్త నారదుడు. అలా బ్రహ్మ కోపాగ్నికి బలైపోయి.. శాపగ్రస్తుడిగా మారిపోయి.. బ్రహ్మచారి అయిన నారదుడు కాస్త గృహస్థుడిగా మారిపోయిన కథ ఎంత మందికి తెలుసు..?


ఒక సందర్బంలో బ్రహ్మదేవుడు మానవ సృష్టి చేస్తూ మొదటగా బ్రహ్మమానస పుత్రులైన పదకొండు మంది ఉత్తమ పుత్రులను సృష్టించాడట. ఆ పదకొండు మంది పుత్రులలో చిన్నవాడు సౌమ్యుడు నారదుడు. సృష్టి పరంపర కొనసాగించడానికి బ్రహ్మ పదకొండు మంది పుత్రులను పెళ్లి చేసుకోమని ఆజ్ఞాపించడంతో మిగతా పది మంది బ్రహ్మ మాట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారట. ఒక్క నారదుడు మాత్రం బ్రహ్మ మాటలు ఖాతరు చేసి.. తను  పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తాడట. అదే విషయం బ్రహ్మకు కరాకండిగా చెప్తాడట. దీంతో బ్రహ్మకు కోపం వస్తుంది. మిగతా వాళ్లు ఎన్ని పెళ్లిళ్లైనా చేసుకుంటామని ఒప్పుకున్నారని.. నువ్వెందుకు ఒప్పుకోవడం లేదని కోప్పడతాడట.

అన్ని రకాలుగా బ్రహ్మ నచ్చ చెప్పినా నారదుడు వినడట. దీంతో కోపోద్రగ్దుడైన బ్రహ్మ దేవుడు నారదుడిని అనేక పెళ్లిళ్లు చేసుకునే గందర్వుడిగా పుట్టెదవు అంటూ శపించాడట. బ్రహ్మ శాపం కారణంగా నారదుడు ఉప బ్రహ్మ అనే  గందర్వుడిగా పుట్టి.. చత్రువంతుడి కూతుర్లైన 50 మందిని పెళ్లి చేసుకున్నాడట. దీంతో బ్రహ్మచారి అయిన నారదుడు కూడా పెళ్లి చేసుకుని వివాహితుడిగా మారిపోయాడని అయితే అది శాపం వల్ల గందర్వ రూపంలో జరిగిందని పండితులు చెప్తున్నారు. ఇక నారదుడు తర్వాత శాప విముక్తి తర్వాత మళ్లీ నారదుడిగా మారిపోయిన బ్రహ్మ దగ్గరకు వెళ్లిపోయిన త్రిలోక సంచారిగా లోక కళ్యాణం కోసం కృషి చేసే గొప్ప వ్యక్తిగా మారిపోయాడని పండితులు చెప్తున్నారు.

 

ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×