E-Paper
Advertisement

Navapanchama Yoga: నవపంచమ యోగం.. ఈ రాశుల వారికి సంపద వర్షం !

Navapanchama Yoga: నవపంచమ యోగం.. ఈ రాశుల వారికి సంపద వర్షం !
Advertisement

Navapanchama Yoga: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. సూర్యుడు తన రాశిని నెల రోజులకు ఒక సారి మారుస్తుండటంతో దాని ప్రభావం మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై ఉంటుంది. దీంతో ఆ రాశుల్లో కొందరి జీవితాలు ఒక విధంగా లేదా మరికొందరి జీవితాలు మరొక రకంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గ్రహాల రాశి మార్పు శుభ లేదా అశుభ యోగాలను కలుగిస్తాయి. ఇలా సూర్యుడు మే 14న శుక్రుడి రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. మరోవైపు కేతువు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు.

దీని వల్ల నవపంచమి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అత్యంత పవిత్రమైన యోగాలల్లో ఒకటి. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారు. నవ పంచమ యోగం వల్ల ఏ రాశి వారికి ధనలాభం కలుగుతుందో తెలుసుకుందాం.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి నవపంచమ యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. కార్యాలయంలో ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం వస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది .వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తులు మంచి లాభాలను అందిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు వేతనాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
సింహ రాశి:
సింహరాశి వారికి నవపంచమ యోగం ప్రయోజనకంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. తండ్రి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. తల్లి ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మీ పనికి మంచి ప్రశంసలు పొందుతారు. మీరు ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో మీకు అన్ని ప్రయత్నాలు కలిసివస్తాయి.

Advertisement

Also Read: 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శని తిరోగమనం..

మీన రాశి:
మీనరాశి వారికి నవపంచమ యోగం చాలా మేలు చేస్తుంది. నవ పంచమ యోగం వల్ల కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరుతాయి. మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వారికి ఈ యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆశించిన బదిలీలు లభిస్తాయి. దీర్ఘకాలంగా ఉన్న కోర్టు కేసులు కూడా ముగుస్తాయి. మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపారులు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కచ్చితంగా పొందుతారు.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×