BigTV English

Flood Flow to Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీగా పెరిగిన వరద నీరు.. పూర్తిగా నిండితే తరువాత పరిస్థితి ఏంటి..?

Flood Flow to Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీగా పెరిగిన వరద నీరు.. పూర్తిగా నిండితే తరువాత పరిస్థితి ఏంటి..?

Flood Flow to Srisailam dam: ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. నారాయణ్‌పూర్, అల్మట్టి జలాశయాలు నిండిపోయాయి. దీంతో నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు వచ్చిన వరద నీరు వెను వెంటనే దిగువనకు వదులుతున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 66 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో, జూరాల వైపు 46 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


జూరాలకు ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని, ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల నుంచి శ్రీశైలం దిశగా వరద సాగుతోంది. జూరాల పూర్తి నీటిమట్టం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7 టీఎంసీల వరకు చేరుకుంది. ఎగువ నుంచి ప్రవాహం వస్తున్నందున జూరాల నుంచి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగు పరివాహక ప్రాంతమైన జూరాల జలాశయం నుంచి వరద నీరు భారీగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది.

Also Read: జగన్ ను అడ్డుకున్న ఏపీ పోలీసులు..అక్కడికి వెళ్లొద్దని వార్నింగ్


శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం 29,420 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రస్తుతం నిలిపివేశారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 807.90 అడుగులుగా ఉంది. రానున్న రెండు రోజుల్లో భారీ స్థాయిలో నీటి నిల్వ పెరిగే అవకాశం లేకపోలేదు.

ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు వద్ద కూడా భారీగా గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే ఎగువ నీటి మట్టం వద్ద 29 మీటర్లు, దిగువ నీటిమట్టం వద్ద 19.16 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యామ్ నీటి మట్టం 29.15 మీటర్లు, దిగువన కాఫర్ డ్యామ్ నీటి మట్టం 18.70 మీటర్ల వరకు వరద నీరు వచ్చి చేరినట్లు చెబుతున్నారు. స్పిల్ వే నుంచి అధికారులు 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పడమటి వాగు, అశ్వారావుపేట వాగుతోపాటు 20 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

కాగా, రాజమహేంద్రవరం వద్ద కూడా గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్నది. ధవళేశ్వర కాటన్ బ్యారేజ్ వద్ద 10.8 అడుగుల వరకు నీటి మట్టం చేరుకుంది. దీంతో సముద్రంలోకి 3.50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

Related News

Roja: వైసీపీ నేత రోజా లోగుట్టు బయటకు.. ఆ మహిళ ఎవరో తెలుసా? అందుకే జగన్ సైలెంట్

Vizag: ఏపీకి గూడ్‌న్యూస్.. విశాఖలో అతి పెద్ద గూగుల్ డేటా సెంటర్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌లో పవన్.. నేతలతో చర్చ, ఆ డబ్బుంతా కరెంటుకే

Aruna Custody: పోలీసుల విచారణలో అరుణ.. వాళ్లకు చెమటలు, వైసీపీ స్కెచ్ ఏంటి?

Village Clinics: ఏపీలో వైద్య సేవ‌ల‌కు మ‌హ‌ర్దశ.. ఇకపై విలేజ్ క్లినిక్‌

YSRCP: వైసీపీకి గుబలు పుట్టిస్తున్న నరసాపురం ఎంపీ..

Big Stories

×