E-Paper
Advertisement

Tuesday: మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు చేయకూడదట – తెలియక చేసినా జన్మజన్మల దరిద్రం పట్టుకుంటుందట

Tuesday: మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ పనులు చేయకూడదట – తెలియక చేసినా జన్మజన్మల దరిద్రం పట్టుకుంటుందట
Advertisement

Tuesday: మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు అసలు చేయకూడదట. తెలిసి చేసినా తెలియక చేసినా జన్మజన్మల దరిద్రం పట్టి పీడిస్తుందట. ఇంకా చెప్పాలంటే హిందూ శాస్త్రం ప్రకారం మంగళవారం నాడు కొన్ని పనులు మాత్రమే చేయాలట అలా కాకుండా ఇష్టమొచ్చినట్టు  మంగళవారానికి విరుద్దమైన పనులు చేస్తే మాత్రం జన్మజన్మల దరిద్రం వెంటాడుతుందట. అందుకే పండితులు మంగళవారం చేయకూడని పనులేవి.. చేయవలసిన పనులేవీ అనే విషయాలు క్లియర్ గా చెప్తున్నారు. ఆ పనులేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ గ్రంథాల ప్రకారం మంగళవారానికి కుజునికి అధిపతి.  కుజుడు ధరత్రీ పుత్రుడు. అందుచేత భూమిపై నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే  కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు… శుభకార్యాలు తలపెట్టరు. అలాగే జ్యోతిష్యశాస్త్రంలో కుజుడు ఎంత నెగెటివ్‌ గ్రహమో అంత పాజిటివ్‌ కూడా ఇస్తాడని ప్రతీతి. చెడుతో పాటు మంచిని ఇస్తాడని నమ్ముతారు. అందుకే మంగళవారం చేయకూడని పనులతో పాటు చేసే పనులు కూడా ఉన్నాయని పండితులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారం చేయవలసిన పనులు:

Advertisement

మంగళవారం ఆంజనేయుడిని ద్యానించడం వలన ధైర్యం చేకూరి, అన్ని పనులు అవుతాయి. అలాగే సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చట.. ఇక మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై విజయం చేకూరుతుందట. అలాగే మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్ధించడం చేస్తే మంఛి ఫలితం ఉంటుంది. జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు. మంగళవారం నాడు..మన బ్యాంకు అకౌంట్ లో ఎంతో కొంత మనీ వేయడం వలన అది వృద్ది చెందుతుందట. మంగళవారం రాహుకాలంలో..( మధ్యాహ్నం 3 నుండీ 4.30 వరకు) దుర్గాదేవి దర్శనం.. దుర్గా స్తోత్రాలు పారాయణము చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. హనుమంతుడికి సింధూరంతో పూజించడం వలన, సుబ్రమణ్యస్వామికి పదకొండు ప్రదక్షణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది.

మంగళవారం చేయకూడని పనులు:

మంగళవారం గోళ్ళు కత్తిరించడం, క్షవరం లాంటివి చేయకూడదు. మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రావడం చాలా కష్టం. ఇక మంగళవారం అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు చేస్తుందట.  అనవసరమైన పనులకు డబ్బంతా ఖర్చు  అయిపోయి అప్పు తీరకపోయే ప్రమాదం ఉంటుందట. మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదట. మంగళవారం అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోకూడదట. మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్ధాలు తినకూడదట. మంగళవారం తలంటు స్నానం చేయకూడదట. దైవకార్యాలకు, విద్యా వైద్య రుణాలు మాత్రం  ఎప్పుడైనా ఇవ్వవచ్చట.

Advertisement

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ:  తిరుమల తిరుపతి బోర్డు నుంచి బంపర్ ఆఫర్ – రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×