E-Paper
Advertisement

Jayeshtha Amavasya: పూర్వీకులకు ఇలా నైవేద్యం పెడితే మీ అడ్డంకులన్నీ మాయం

Jayeshtha Amavasya: పూర్వీకులకు ఇలా నైవేద్యం పెడితే  మీ అడ్డంకులన్నీ మాయం

Jayeshtha Amavasya: హిందూ ఆచారాల ప్రకారం అమావాస్య తిథి నాడు పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం నిర్వహిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి నెల కృష్ణ పక్షం చివరి తేదీ అమావాస్య వస్తుంది. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ కృష్ణ పక్ష అమావాస్య తేదీని హిందూ గ్రంధాలలో చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శని దేవుడిని పూజించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. శని దేవుడిని పూజించడం వల్ల అనేక దోషాలు తొలిగిపోతాయని నమ్ముతారు. అంతేకాదు, ఈ రోజున తర్పణానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం, దానం చేయడం వంటి పుణ్యకార్యాలు చేస్తే పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈ మేరకు వైదిక పంచాంగం ప్రకారం, ఈ సారి జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున శివుడికి రుద్రాభిషేకం చేస్తే శివయ్య సంతోషించి భక్తులకు అనుగ్రహం ఇస్తాడని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ సంవత్సరం జ్యేష్ఠ అమావాస్య 6 జూన్ 2024 న రానుంది. ఈ రోజున పూర్వీకులకు నైవేద్యాలు సమర్పిస్తే మనకు వచ్చే అడ్డంకులను తొలగిస్తారని శాస్త్రం చెబుతుంది. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నైవేద్యాలు ఎలా చేయాలి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యేష్ఠ అమావాస్య రోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. దీని తరువాత, పూర్వీకులను స్మరించుకుని వారికి నల్ల నువ్వులు, తెల్లని పువ్వులు, కుశలను సమర్పించండి. ఇది పూర్వీకులను సంతోషపరిచి పిత్ర దోషం నుండి విముక్తి ఇస్తారు. వీలైతే ఇంట్లో బ్రాహ్మణుడిని పిలిపించి పూర్వీకులకు నైవేద్యాన్ని పెట్టే కార్యక్రమం చేసుకోవచ్చు. పూర్వీకులకు ఖీర్ సమర్పిస్తే సంతోషిస్తారు. ఖీర్‌లో ఏలకులు, కుంకుమపువ్వు, తేనె వేసి తయారుచేయాలి.

పిత్ర దోషం

జాతకం ప్రకారం పితృ దోషం వల్ల ఇబ్బంది పడినట్లయితే, అది త్వరగా తొలగిపోవాలంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత పీపల్ చెట్టు మూలానికి నీటిని సమర్పించండి. దీంతో పిత్ర దోషం నుండి విముక్తి పొందుతారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పీపల్ చెట్టులో నివసిస్తారు అని నమ్ముతారు. అదే సమయంలో, పూర్వీకులు కూడా ఈ చెట్టులో నివసిస్తారు.

Tags

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×