BigTV English
Advertisement

Case on Sajjala, Why?: బుక్కైన సజ్జల, తాడేపల్లి పోలీసులు కేసు నమోదు

Case on Sajjala, Why?: బుక్కైన సజ్జల, తాడేపల్లి పోలీసులు కేసు నమోదు

Tadepalli police Case register on Sajjala(AP political news): ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలీదు. కాకపోతే విక్టరీ సంకేతాలన్నీ కూటమి వైపు చూపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇంతకీ ఏ విషయంలో తెలుసా? రెండు రోజుల కిందట మీడియాలో సమావేశంలో కౌంటింగ్ ఏజెంట్లపై కీలక వ్యాఖ్యలు చేశారాయన. ఆ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. ఇంతకీ సజ్జల ఏమన్నారు?

బుధవారం తాడేపల్లిలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మనం ఏమీ ఇక్కడ కూర్చొని రూల్స్ ఫాలో కావడానికి రాలేదని, సాధ్యమైనంత వరకు వాదన చేసేవాళ్లు కూర్చోవాలన్నారు సజ్జల. కౌంటింగ్ ఏజెంట్స్.. రూల్స్ ఫాలో అయ్యి వెనక్కి తగ్గేవాళ్లు రావద్దని తేల్చి చెప్పేశారు. టీడీపీ, జనసేన ఏజెంట్లకు ప్రతి విషయంలో అడ్డం తిరగాలని సూచన చేశారు.


ALSO READ:  ఎవరి తాలూకా? స్టిక్కర్‌ వార్ @ పిఠాపురం

సజ్జల వ్యాఖ్యలు ముమ్మాటికీ ఎన్నికల నియమావళికి ఉల్లంఘించడమేనని ఆరోపించింది టీడీపీ. ఈ క్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమ, న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 153, 505, 125 మూడు సెక్షన్ల కింద సజ్జలపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

ఎన్నికల నోటిఫికేషన్ మొదలు వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చివరకు ఆ పార్టీలో కీలక నేత అయిన సజ్జలపై పోలీసులు కేసు నమోదు చేయడం కొందరు నేతలకు మింగుడుపడడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే, రేపటి రోజున అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్థితి ఏంటని చర్చించుకోవడం నేతల వంతైంది.

Related News

CM Progress Report: లక్షా 2 వేల కోట్ల పెట్టుబడులు.. 85 వేల 570 ఉద్యోగాలు.. చంద్రబాబు యాక్షన్ ప్లాన్

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Big Stories

×