E-Paper
Advertisement

Hair Washing Days: ఏంటీ ? ఆ రోజుల్లో తలస్నానం చేయకూడదా ?

Hair Washing Days: ఏంటీ ? ఆ రోజుల్లో తలస్నానం చేయకూడదా ?
Advertisement

Hair Washing Days: హిందూ ధర్మశాస్త్రంలో.. ప్రతి పనికి ఒక శుభ సమయం, శుభ దినం నిర్ణయించారు. తల స్నానం చేయడం అనేది కేవలం శుభ్రతకు మాత్రమే కాదు, ఇది ఒక కర్మగా భావిస్తారు. తల స్నానం చేసే రోజు మన శరీర, మానసిక స్థితిపై, ఆయుష్షు, సౌభాగ్యంపై ప్రభావం చూపుతుందని నమ్మకం. ఈ నియమాలు ముఖ్యంగా తలంటు స్నానం చేసేటప్పుడు పాటిస్తారు. అయితే సాధారణ తల స్నానం విషయంలో కూడా కొన్ని నియమాలు వర్తిస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

పురుషులకు శుభకరమైన రోజులు:

పురుషులు తల స్నానం చేయడానికి సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం రోజులు శుభకరమైనవిగా పరిగణిస్తారు.

Advertisement

సోమవారం: ఈ రోజు తల స్నానం చేస్తే శుభం కలుగుతుంది. సౌభాగ్యం పెరుగుతుందని నమ్మకం.

బుధవారం: ఈ రోజు స్నానం చేస్తే ధన లాభం, విద్యాభివృద్ధి కలుగుతుందని చెబుతారు. అంతే కాకుండా ఇది అత్యంత శ్రేష్ఠమైన రోజుగా నమ్ముతారు.

గురువారం: ఈ రోజు స్నానం చేయడం వల్ల జ్ఞానం, సకల శుభాలు కలుగుతాయి.

శుక్రవారం: పెళ్లి అయిన మగవారు ఈ రోజు స్నానం చేయడం వల్ల భార్యకు మేలు, ఆరోగ్యం, సంపద పెరుగుతాయి.

స్త్రీలకు శుభకరమైన రోజులు:

స్త్రీలు తల స్నానం చేయడానికి సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం రోజులు శుభకరమైనవిగా చెబుతారు.

సోమవారం: ఈ రోజు స్నానం చేయడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషం కలుగుతాయి.

బుధవారం: ఈ రోజు స్నానం ధన లాభం, సకల శుభాలను ఇస్తుంది.

శుక్రవారం: మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం, సౌభాగ్యం, దీర్ఘ సుమంగళిత్వం కలుగుతాయి. వివాహిత స్త్రీలకు అత్యంత ముఖ్యమైన రోజు.

శనివారం: ఈ రోజు స్నానం చేయడం వల్ల శారీరక శక్తి, సౌఖ్యం లభిస్తుంది.

తల స్నానం చేయకూడని రోజులు:

ధర్మశాస్త్రం ప్రకారం.. కొన్ని రోజులలో తల స్నానం చేయడం అశుభం లేదా హానికరమని పరిగణిస్తారు.

ఆదివారం: ఈ రోజు తల స్నానం చేయడం వల్ల ఆయుక్షీణం (ఆయుష్షు తగ్గుట), ధన నష్టం కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

మంగళవారం: ఈ రోజు స్నానం చేస్తే రోగాలు, వ్యాధులు కలుగుతాయి. దుఃఖానికి దారి తీస్తుందని నమ్మకం.

శనివారం: పురుషులు తల స్నానం చేస్తే దుఃఖం, అశుభం కలుగుతాయి. (అయితే.. స్త్రీలకు శుభకరమైనది.)

గురువారం: స్త్రీలు తల స్నానం చేస్తే దారిద్ర్యం, వైధవ్యం వంటి అశుభాలు కలుగుతాయని, లక్ష్మీదేవికి ఇష్టం లేని రోజుగా భావిస్తారు.

Also Read: ఎంత దిష్టి ఉన్నా.. ఇలా చేస్తే క్షణాల్లోనే.. పోవాల్సిందే !

ఇతర నియమాలు:

అమావాస్య, పౌర్ణమి, సంక్రాంతి వంటి పండగ, పర్వదినాలలో తల స్నానం చేయడం అత్యవసరం,A శుభకరం.

గ్రహణం తర్వాత తప్పనిసరిగా తల స్నానం చేయాలి.

దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు, ముఖ్యమైన యాత్రకు వెళ్లేవారు, ప్రత్యేక పూజలు చేసేవారు ఈ నియమాలను పాటించడంలో మినహాయింపు ఉంటుంది.

సాధారణంగా.. ఉదయం సూర్యోదయానికి ముందే లేదా సూర్యోదయ సమయంలో స్నానం చేయడం ఉత్తమం.

ఈ నియమాలన్నీ ముఖ్యంగా తలంటు స్నానం విషయంలో పాటించాలని ధర్మశాస్త్రం ఉద్ఘాటిస్తుంది. కేవలం నీటితో చేసే సాధారణ తల స్నానం విషయంలో నియమాల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×