E-Paper
Advertisement

Plants for home: మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలా? అయితే మెయిన్ డోర్ దగ్గర ఈ మొక్కలు ఉండాల్సిందే!

Plants for home: మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలా? అయితే మెయిన్ డోర్ దగ్గర ఈ మొక్కలు ఉండాల్సిందే!
Advertisement

Plants for home: వాస్తు శాస్తం, ప్రకృతికి విడదీయలేని సంబంధం ఉంది. మన ఇంటి ప్రధాన ద్వారం కేవలం మనుషులు వచ్చే దారి మాత్రమే కాదు. అది ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించే మార్గం కూడా. ఇంటి గుమ్మం దగ్గర కొన్ని ప్రత్యేకమైన మొక్కలను నాటడం వల్ల కేవలం అందం పెరగడమే కాకుండా.. అదృష్టం, ఐశ్వర్యం, ప్రశాంతత లభిస్తాయని నమ్మకం. ప్రకృతి సిద్ధమైన ఈ మొక్కలు ఇంట్లోని ప్రతికూలతను తొలగించి.. ప్రాణవాయువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయి. అదృష్టాన్ని తెచ్చే ఆ మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటి ప్రధాన ద్వారం వద్ద అదృష్టాన్ని ఇచ్చే మొక్కలు:
హిందూ సంప్రదాయం, ఫెంగ్ షుయ్ ప్రకారం.. ఇంటి ముందర ఉండాల్సిన ముఖ్యమైన మొక్కలు ఇవే..

Advertisement

1. తులసి మొక్క :

హిందువుల ఇళ్లలో తులసి మొక్క లేని ఇల్లు ఉండదు. ఇది సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద తులసి కోట ఉండటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇది గాలిని శుద్ధి చేయడమే కాకుండా.. ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా అడ్డుకుంటుందని నమ్మకం. ప్రతిరోజూ దీనికి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయి.

Advertisement

2. మనీ ప్లాంట్ :
మనీ ప్లాంట్ పేరులోనే అదృష్టం ఉంది. ఫెంగ్ షుయ్ ప్రకారం, దీనిని ఇంటి ఆగ్నేయ దిశలో లేదా ప్రధాన ద్వారం దగ్గర పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ మొక్క ఎంత ఏపుగా పైకి పాకితే, అంతగా వృద్ధి ఉంటుందని చెబుతారు. అయితే దీనిని ఎప్పుడూ కిందకు పాకనివ్వకూడదు.

3. కలబంద :
చాలామంది కలబందను కేవలం చర్మ సౌందర్యం కోసమే అనుకుంటారు. కానీ వాస్తు ప్రకారం, కలబంద మొక్క సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇది గాలిలోని విషతుల్యాలను పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఇస్తుంది. ఇంటి ముందర కలబంద ఉండటం వల్ల ఆయురారోగ్యాలు మెరుగుపడతాయని నమ్మకం.

4. జేడ్ ప్లాంట్ :
దీనిని ‘అదృష్ట వృక్షం’ అని కూడా పిలుస్తారు. దీని ఆకులు చిన్నగా, మందంగా నాణేల మాదిరిగా ఉంటాయి. ప్రధాన ద్వారం వద్ద జేడ్ ప్లాంట్ ఉంటే అది సంపదను అయస్కాంతంలా ఆకర్షిస్తుందని ఫెంగ్ షుయ్ నిపుణులు చెబుతారు. ఇది తక్కువ నీటితో.. ఎక్కువ కాలం జీవిస్తుంది కాబట్టి నిర్వహణ కూడా సులభం.

5. మల్లె మొక్క :
మల్లె పూల సువాసన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇంటి ముందర మల్లె మొక్క ఉంటే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందని.. ఇంట్లో ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుందని నమ్మకం. దీని పరిమళం ఒత్తిడిని తగ్గించి, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

Also Read: మీ ఇంటిపై చెడు కళ్లు పడ్డాయా? ఈ పూజతో నరదృష్టి నుంచి విముక్తి పొందండి!

మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఎండిన మొక్కలు: ఇంటి ముందర ఎప్పుడూ ఎండిపోయిన లేదా చనిపోయిన మొక్కలను ఉంచకూడదు. ఇది దౌర్భాగ్యానికి సంకేతం.

ముళ్ల మొక్కలు: కాక్టస్ వంటి ముళ్ళతో కూడిన మొక్కలను ప్రధాన ద్వారం వద్ద పెట్టకూడదు. ఇవి ఇంట్లో గొడవలకు దారితీసే అవకాశం ఉంది.

శుభ్రత: మొక్కల చుట్టూ ఎప్పుడూ చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×