Rahu into Aquarius: కుభరాశిలోకి వెళ్తున్న రాహుగ్రహం.. మీన రాశి వారికి ఊహించని సంఘటనలు జరగనున్నాయా..? అసలు మీనరాశికి ఏలినాటి శని నడుస్తున్న ఈ టైంలో రాహువు ఏం చేయబోతున్నాడు. కుభంలోకి రాహువు వెళ్తే మీన రాశి వారికి ఓరిగేదేమిటి..? రాహు గ్రహ కుంభ ప్రవేశం మీనానికి మంచి జరుగుతుందా..? ఏదైనా అశుభం జరగుతుందా..? ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల మార్పు అనేది నిరంతరం జరగుతూనే ఉంటుంది. గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే.. మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. తాజాగా మే 18వ తారీఖు నాడు రాహు గ్రహం కుంభ రాశిలోకి వెళ్తుంది. కుంభంలో రాహువు ఏడాదిన్నర ఉంటాడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అయితే రాహుగ్రహ మార్పు వల్ల ఇప్పుడు మీన రాశివారికి ఊహించని మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిషులు విశ్లేషిస్తున్నారు. ఇంతకీ మీనరాశికి రాబోతున్నా ఆ మిశ్రమ ఫలితాలేంటి..? వాటికి ఎలాంటి రెమెడీలు పాటించాలి. అసలు జ్యోతిష్య పండితులు ఏం చెప్తున్నారు..?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మే 18వ తారీఖు నుంచి రాహు గ్రహం 12 వ స్థానంలోకి వెళ్తుంది. ఇలా వెళ్లడం వల్ల మీన రాశి జాతకులకు అత్యంత యోగమైన కాలం అని చెప్తున్నారు పండితులు. ఈ గ్రహ మార్పు కారణంగా మీన రాశి వారికి ఇన్నాళ్లు దూరమై పోయిన వ్యక్తులు మళ్లీ దగ్గర అవుతారట. ఏన్నో ఏళ్లుగా అన్నదమ్ముల మధ్య ఉన్న సమస్యలు సమసి పోయి సోదరుల మధ్య ప్రేమ అప్యాయతలు పెరుగుతాయి. ఇక మీన రాశి వారికి ఇతరులకు సహాయం చేసేటటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి మంచి గుణాన్ని కూడా రాహుగ్రహ మార్పు ఇవ్వబోతుంది. ఇన్ని రోజులు శత్రువుల మీద గెలవాలని మీరు పడిన తపన తీరనుంది. రాహు మార్పు వల్ల మీరు మీ శత్రువుల మీద పై చేయి సాధిస్తారు. ఎంతటి శత్రువైన మీ ముందు ఓడిపోయే పరిస్థితులు వస్తాయి. ఇక విద్యార్థులకు అద్వితీయమైన కాలం అని చెప్పొచ్చు.. రాహు గ్రహ మార్పు వల్ల విద్యా పరంగా అద్బుతమైన యోగం రాబోతుంది. ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న విదేశాలలో చదువుకునే కోరిక నెరవేరనుంది. ఇక రాహు గ్రహ మార్పు వల్ల మీన రాశి జాతకులకు ఎంతో సుఖవంతమైన జీవితం రాబోతుందని పండితులు చెప్తున్నారు.
అయితే ఇన్ని మంచి యోగాలు ఇస్తున్న రాహువు ఒక్క సమస్యను ఇస్తాడు. అది చెడ్డ వ్యక్తులతో స్నేహాన్ని కలిగిస్తాడు. అత్యాశను కలిగిస్తాడు. ఒక భ్రమను కలిగిస్తాడు. అత్యాశకు పోయి ఉన్నదంతా పోయేటట్టు చేస్తాడు. అందుకే మీన రాశి వారు అత్యాశకు పోకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకునేలా చేస్తాడు. కచ్చితంగా స్థాన భ్రంశాన్ని కలిగిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులైతే బలవంతంగా ట్రాన్స్ ఫర్ అవ్వాల్సి వస్తుంది. సాప్ట్ వేర్ ఉద్యోగులకు అయితే ప్రమోషన్ రావడంతో విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. భార్య తరపు బంధువులతో మంచి రిలేషన్ ఏర్పడుతుంది. అయితే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావడంతో ధనం ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. అలాగే చాలా దగ్గరి వ్యక్తి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. ఇలాంటి ప్రతికూలతలు తొలగిపోవాలంటే వెండితో చేసిన ఏనుగు బొమ్మను మీ ఇంటికి నైరుతి భాగంలో పెట్టాలి. మీరు వాడే తలగడ కూడా పత్తితో తయారు చేసిందే వాడాలి. మీరు సంపాదించిన దాంట్లో వన్ పర్సెంట్ మీ సోదరికి కానీ మీ కూతురుకు కానీ ఇవ్వాలి. ఈ పరిహారాలు పాటిస్తే మీన రాశి వారు అద్బుతమైన ఫలితాలు పొందుతారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్