Gouri G Kishan: ఈ మధ్య ప్రెస్ మీట్స్ లో జర్నలిస్టులు ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారో వారికే తెలియడం లేదు. సెలబ్రిటీలు కూడా మనుషులే అన్న విషయం మరిచి.. నోటికి వచ్చిన ప్రశ్నను అడిగేస్తూ వారిని అవమానిస్తున్నారు. ఇది కేవళంలో టాలీవుడ్ లోనే ఉంది అనుకుంటే పొరపాటే. అన్ని ఇండస్ట్రీలలో జర్నలిస్టులు అందరూ ఒకేలా ఉన్నారు. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ గౌరీ జి కిషన్ కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురయ్యాయి. కానీ, ఆమె సైలెంట్ గా ఉండకుండా సదురు జర్నలిస్ట్ పై మండిపడింది. దీంతో వివాదం పెద్దదయ్యింది.
అసలు ఏం జరిగిందంటే.. 96 సినిమాతో గౌరీ జి కిషన్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. చిన్నప్పటి త్రిష పాత్రలో ఆమె నటించి మెప్పించింది. తెలుగులో జాను సినిమాలో కూడా ఆమె ఆ పాత్రను పోషించి ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తరువాత తమిళ్, తెలుగు భాషల్లో హీరోయిన్ గా కొనసాగుతున్న గౌరీ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం అదుర్స్. ఆదిత్య మాధవన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అభిన్ హరికరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్ట్.. సినిమాకు సంబంధించిన ప్రశ్నలను అడగడం మానేసి.. గౌరీని మీ బరువెంత.. ? చాలామంది హీరోయిన్లు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. మీరు చెప్పండి అని అడిగాడు. దీంతో గౌరీ అసహనం వ్యక్తం చేసింది. నా బరువుతో మీకేం పని.. ? ఈ సినిమాకు నా బరువు ఏమైనా నష్టం చేకురుస్తుందా.. ? సినిమాకు సంబంధించిన ఒక్క ప్రశ్న అన్నా అడిగారా.. ? అసలు ఇది జర్నలిస్ట్ అడిగే ప్రశ్న యేనా.. ? ఇది అసలు జర్నలిజమే కాదు అని ఫైర్ అయ్యింది. దీంతో సదురు జర్నలిస్ట్ కూడా మండిపడ్డాడు. అలా వీరిద్దరి మధ్య వాగ్వాదం పెద్దది అయ్యింది.
ప్రతి మహిళకు ఒక భిన్నమైన శరీరాకృతి ఉంటుంది. PCOD గురించి మీకు తెలుసా.. దాని గురించి తెలుసుకోండి ముందు.నా సినిమాలా గురించి మాట్లాడండి.. నా నటన గురించి మాట్లాడండి. ఇదొక తెలివి తక్కువ ప్రశ్న. ఇలాంటి ప్రశ్న మీరు హీరోలను అడగగలరా.. ? ప్రెస్ మీట్ లో నేను ఒక్కదాన్నే అమ్మాయిని ఉండడం వలన ఇలా నన్ను అవమానిస్తున్నారా..? అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇక ఇంత జరుగుతున్నా పక్కనే హీరో, డైరెక్టర్ మౌనం వహించడం మరింత వివాదానికి దారి తీసింది.
ప్రెస్ మీట్ లో మాట్లాడని హీరో ఆదిత్య మాధవన్.. సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తనకు ఏమి మాట్లాడాలో తెలియలేదని, ఆ ప్రశ్న విని తానే షాక్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్ లో వైరల్ గా మారింది. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.