IFFI 2025 : సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో అవార్డులు ఉంటాయి. అందులో అన్నిటికన్నా గొప్పది ఆస్కార్.. ఈ అవార్డు రాకపోయిన ఎంపిక చేసిన సినిమాల లిస్ట్ లో తమ సినిమా పేరు రావాలని అనుకుంటారు. అలాగే నంది అవార్డ్స్, ఐఫా, గామా వంటి ఎన్నో అవార్డులు ఉన్నాయి. అంతేకాదు IFFI అవార్డులు కూడా సినీ ఇండస్ట్రీకి సంబందించినవే.. ఈ ఏడాది ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అవార్డులకు సెలెక్ట్ అయినా సినిమాల లిస్టు ని అనౌన్స్ చేసారు.. ఈ లిస్టులో మలయాళ చిత్రంకు చోటు దక్కింది. బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో ఈ సినిమాను ఎంపిక చేశారు. ఆ మూవీ పేరేంటి? ఈ కార్యక్రమం గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం..
IFFI 2025 ను ఘనంగా నిర్వహించనున్నారు.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 2025 ను గోవాలో నిర్వహించనున్నారు..ఈ ఈవెంట్ కోసం బెస్ట్ క్యాటగిరిలో మూవీలను సెలెక్ట్ చేస్తారు. ఈసారి భారతీయ చిత్రానికి ఈ వేడుకలో చోటు దక్కింది. మలయాళ బ్లాక్ బాస్టర్ మూవీ ARM ఎంపిక అయ్యింది. ఐదు భారతీయ చిత్రాలలో, పోటీలో ఉన్న ఏకైక మలయాళ చిత్రం ARM. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ క్యాటగిరిలో ఈ మూవీని సెలెక్ట్ చేసిన విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.. ప్రస్తుతం ఇది మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. యాక్షన్ మూవీగా వచ్చిన ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు మంచి వసూళ్లను కూడా సొంతం చేసుకుంది. అలాంటి మూవీకి అవార్డు రాబోతుండటంతో మలయాళ సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.
Also Read : ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?
ప్రతి యేటా గోవాలో జరుగుతున్న వార్షిక ఫిల్మ్ ఫెస్టివల్ . ప్రపంచంలోని సినిమా థియేటర్లు చలనచిత్ర కళ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ఈ వేదికను ఏర్పాటు చేస్టారు. ఈ వేడుకలు ఎన్నో సినిమాలకు ప్రత్యేక గౌరవం దక్కుతుంది.. కేటగిరీలలో ఎంపికైన సినిమాలకు అవార్డులను అందిస్తుంటారు. ఇప్పటికీ 55 వేడుకలు పూర్తయ్యాయి. ప్రస్తుతం 56వ వేడుకకు రంగం సిద్ధం చేశారు. ఈ ఏడాది నవంబర్ 20 నుంచి 28 వరకు ఈ వేడుక జరగనుంది.. ఇప్పటికే ఎన్నో సినిమాలను అవార్డుల కోసం ఎంపిక చేశారు. గత ఏడాదిడో పోలిస్తే ఈ ఏడాది ఎన్నో సినిమాలు ఎంపిక అయినట్లు సమాచారం. ఈ సారి అవార్డుల విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఏది ఏమైన కూడా ఈ వేడుక కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు.. మరి ఏ చిత్రానికి ఏ అవార్డు వరిస్తుందో తెలియాలంటే కొద్ది రోజుకు వెయిట్ చెయ్యాల్సిందే..
Honoured to share that our film #ARM has been officially selected for the prestigious Indian Panorama’s Best Debut Director Competition at the 56th International Film Festival of India (IFFI) 2025, Goa).
Out of the five Indian films chosen, ARM is the only Malayalam film in the… pic.twitter.com/YDaxo2ZIBA— Tovino Thomas (@ttovino) November 6, 2025