Financial Remedies: ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా..? ఎన్ని పరిహారాలు పాటించినా సమస్య తీరడం లేదా..? అయితే మీ రాశి ప్రకారం చేయాల్సిన పరిహారం చేసి చూడండి ఇక అంతే వద్దంటే డబ్బు నిలుస్తుంది. ఈ చిన్న పరిహారాలు మీ జీవితాలనే మార్చేస్తుంది. వచ్చిన డబ్బు వచ్చినట్టే మీ గల్లాపెట్టెలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆ పరిహారాలేవో రాశుల వారిగా ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం రాశి: మేష రాశి వారు డబ్బు నిలవడానికి ఎరుపు లేదా నారింజ రంగు దారం ఎప్పుడూ చేతికి కట్టుకోండి. వల్లి దేవసేన సమేత నృసింహ స్వామి వారి పటాన్ని పూజా మందిరంలో ఉంచి పూజలు చేయండి.
వృషభ రాశి: ఈ రాశి వారు ఎన్ని పరిహారాలు చేసినా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అవుతుంటే.. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూడండి. అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నేతితో దీపారాధన చేయండి. దీంతో మీ సమస్య తీరిపోతుంది.
మిథన రాశి: ఈ రాశి వారు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించండి. పూజా మందిరంలో మట్టిపాత్రలో కలశం పెట్టి అందులో తులసి ఆకులు వేసి ఉంచండి. మీ డబ్బు సమస్య మెల్లగా కనుమరుగవుతుంది.
కర్కాటక రాశి: ఈ రాశి జాతకులు ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోతే ఎప్పుడూ తెలుసు రంగు చెప్పులు ధరించండి. ప్రతి పౌర్ణమికి వెండి పాత్రలో పాలు, తేనే కలిసి చంద్రునికి నైవేద్యం పెట్టండి. మీ సమస్య తీరిపోతుంది.
సింహ రాశి: ధన సమస్యలతో సతమతమయ్యే సింహ రాశి జాతకులు ప్రతిరోజూ నాగ సింధూరం తిలకంగా ధరించండి. మీ ఇంటి ఈశాన్య దిశలో నీటి పాత్రను ఉంచి అందులో పూలు పచ్చకర్పూరం వేయండి. దీంతో మీ ధనం సమస్యలు పత్తా లేకుండా పారిపోతాయి.
కన్య రాశి: కన్యా రాశి జాతకలు డబ్బులు నిలవడానికి రావి ఆకు మీద అష్టాక్షరీ మంత్రాన్ని లిఖించి పారే నీటిలో వదిలేయండి. అలాగే ఎప్పుడూ మీ చేతికి గ్రీన్ కలర్ వాచీ ధరించండి.
తులా రాశి: ఈ రాశి వారు పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఇంట్లో దేవుని దగ్గర తామర కాడల నారతో చేసిన వత్తితో దీపారాధన చేయండి. మీ సమస్య తీరిపోతుంది.
వృశ్చిక రాశి: డబ్బులు బాగా నిలవడానికి వృశ్చిక రాశి జాతకులు ఎరుపు రంగు పూలతో లక్ష్మీ అమ్మ వారిని పూజించండి. అలాగే ప్రతి మంగళవారం కొంత డబ్బు దాచండి.
ధనస్సు రాశి: ఈ రాశి జాతకులు పసుపు రంగు బట్టలు ఎక్కువగా ధరించండి. నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. దీంతో మీకున్న అన్ని రకాల ఆర్థిక సమస్యలు క్రమంగా తీరిపోతాయి.
మరక రాశి: మకరరాశి జాతకులు ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోతే.. తమ ఇంటి గుమ్మానికి ఎదురుగా వేణువును ఉంచండి. అలాగే నుదుటిపై శ్రీగంధం తిలకధారణ చేయండి.
కుంభ రాశి: ఈ రాశి జాతకులు చేతిలో డబ్బు నిలవకపోతే నిత్యం సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. శుచిగా ఉండండి. నుదుట నాగసింధూరం ధరించండి.
మీన రాశి: మీకు ఎంత సంపాదించినా రూపాయి పొదుపు చేయలేకపోతుంటే.. మీ ఇంటి గడపకు గుర్రపు నాడా వేళాడదీయండి. పారే నీటిలో రాగి నాణేం వేయండి. అలాగే అల్లము, బెల్లం కూడా వదలండి.
ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించి మీకున్న అన్ని రకాలైన ఆర్థిక సమస్యలను దూరం చేసుకోండి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే కానీ బిగ్ టీవీ సొంతంగా క్రియేట్ చేసింది మాత్రం కాదని గమనించగలరు. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు