Weather Update: తెలంగాణలో రాబోయే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. అయితే వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అయితే మధ్యాహ్నం మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే వర్షాలు పడుతున్నాయి. అయితే రాబోయే రెండు రోజుల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో గత మూడు, నాలుగు రోజుల నుంచి వాతావరణం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండలు కొడుతున్నా.. సాయంత్రం కాగానే ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే.. దక్షిణ తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించగా.. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రానికి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది.
ఈ నేపథ్యంలోనే రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు రాత్రికి ఆదిలాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
ALSO READ: AP Rains: విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక.. ఆ జిల్లాలలో వర్షం ఆగేదేలేదట!
రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాగల రెండు, మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రానికి భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే ఈ మూడు రోజులు అత్యవసరం అయితే తప్ప పొలాల వద్దకు రైతులు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు.
ALSO READ: Court Jobs: అద్భుతమైన అవకాశం.. భారీగా కోర్టు ఉద్యోగాలు.. ఏడో తరగతి నుంచి అర్హత స్టార్ట్..