BigTV English

Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్ధి.. విశిష్టత..

Sankashtahara Chaturthi: సంకష్టహర చతుర్ధి.. విశిష్టత..

Sankashtahara Chaturthi: వినాయక చవితి పండుగ నాడు మనమంతా గణపయ్యను పూజిస్తాం. అయితే.. సంకష్టహర చతుర్థి కూడా వినాయక చవితి అంతటి మహిమ గల పవిత్రమైన రోజని గణపతి పురాణం చెబుతోంది. సంకష్టహర చతుర్థి నాడు ఆ ఏకదంతుడిని మనసారా ఆరాధించేవారి కోర్కెలన్నీ నెరవేరతాయని పండితులు సూచిస్తున్నారు.


ప్రతి నెలా వచ్చే ఈ పండుగ.. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడు ఈ పండుగ వస్తుంది. ఆ రోజు చంద్రదర్శనం వేళ.. ఈ సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తారు. నెలకోసారి చొప్పున ఏడాదికి 12 సార్లు ఈ సంకష్టహర చతుర్థి వస్తుంది.
వినాయక చవితి నాటి సాయంత్రం చంద్రుడిని చూడటం నిషేధం. అయితే.. రోజు వినాయకుడికి పూజ చేసేవారు, వ్రతం చేసేవారు చంద్రోదయం తర్వాతే స్వామిని ఆరాధిస్తారు.


వ్రతం చేసేవారు చవితి నాటి వేకువనే నిద్రలేచి.. తల స్నానం చేసి, రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం స్నానానంతరం చంద్రోదయం కాగానే చవితి తిథి ఉన్న సమయంలో గణపయ్యకు జరిగే అభిషేకంలో పాల్గొంటారు.
గరిక, తుమ్మిపూలు, ఎఱ్ఱని పూలు, జిల్లేడు పూలతో స్వామిని పూజిస్తారు. స్వామికి అభిషేకం జరుగుతుండగా పండితులు అధర్వ శీర్షం పఠిస్తారు. అత్యంత కష్టాలను హరించే శక్తి అధర్వశీర్షానికి ఉందని శాస్త్రవచనం.
తర్వాత వినాయకుడికి ఇష్టమయిన అరటి పళ్ళు, టెంకాయ, బెల్లంతో చేసిన నైవేద్యాలు నివేదిస్తారు. పూజంతా అయ్యాక చంద్రుడిని చూసి, ఎవరికైనా దానం చేస్తారు. లేదా భోజనం పెట్టి.. ఆ తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.


పౌర్ణమి తర్వాత వచ్చే చవితి నాడే మంగళవారం గనుక వస్తే.. దానిని అంగారక చతుర్థి అంటారు. కొత్తగా వ్రతం చేసే వారు ఈ రోజున మొదలుపెట్టి తమశక్తి కొద్దీ 12 నెలలు, 40 నెలలు, జీవితాంతమూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
కుజ దోషాలు, జాతక దోషాల వల్ల కష్టాలను ఎదుర్కొనే వారికి ఈ వ్రతం అమృత ఫలితాలనిస్తుంది. పితృదేవతల బాధల తొలగి, వారి ఆశీస్సులూ లభిస్తాయి.

Related News

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navratri 2025: దృష్టశక్తులు తొలగిపోవాలంటే.. నవరాత్రి సమయంలో ఇలా చేయండి !

Bastar Dussehra Festival: అక్కడ 75 రోజుల పాటు దసరా ఉత్సవాలు.. ప్రాముఖ్యత ఇదే!

Navratri Day 5: నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారిని.. ఏ విధంగా పూజించాలి ?

Bathukamma: అలిగిన బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది ? ఈ రోజు నైవేద్యం ఎందుకు సమర్పించరు ?

Big Stories

×