BigTV English

Aishwarya Rai Life Story : అందం.. అభినయం.. ఐశ్వర్య రాయ్ @ 50..

Aishwarya Rai Life Story :  అందం.. అభినయం..  ఐశ్వర్య రాయ్ @ 50..
Aishwarya Rai life story

Aishwarya Rai Latest news(Bollywood news today):

అందానికి.. అభినయానికి కేరాఫ్ అడ్రస్ ఉంది అంటే వెంటనే అందరికీ గుర్తు వచ్చే పేరు ఐశ్వర్యారాయ్ బచ్చన్. జీన్స్ సినిమాలో ‘ జగమున అతిశయాలు యేడేనా ఓ మాట్లాడే పువ్వాను ఎనిమిదవ అతిశయమే’.. అనే పాటలో ఆమెను చూసిన ప్రతిసారి అచ్చంగా ఐశ్వర్యారాయ్ కోసమే ఆ పాట రాశారేమో అనిపిస్తుంది. ఎంతో అనుభవం ఉన్న ఒక శిల్పి.. ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక అందమైన పాలరాతి పై తన అనుభవాన్ని అంతా ధారపోసి జాగ్రత్తగా చెక్కిన ఒక శిల్పం ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుందో ఐశ్వర్య అలా ఉంటుంది.


దేవకన్యలు అలా ఉంటారు..ఇలా ఉంటారు అని వినడమే తప్ప ఎవ్వరూ చూసింది లేదు. అయితే మొన్న పొన్నియన్ సెల్వన్ మూవీలో రాయల్ కాస్ట్యూమ్ లో ఐశ్వర్యాను చూస్తుంటే దేవకన్యలు ఇలాగే ఉంటారేమో అనిపించక మానదు. అలాంటి గొప్ప సౌందర్యవతి కాబట్టే ప్రపంచ సుందరి కిరీటాన్ని తల మీద ధరించింది. సౌందర్యానికి మించి అందమైన మనసు కలిగిన ఐశ్వర్య పుట్టినరోజు ఈరోజే. ఇక ఈరోజు సోషల్ మీడియా మొత్తం ఐశ్వర్య బర్త్డే విషెస్ తో అభిమానులు నింపేస్తారు.

ఆమె తన నటనతో యావత్ ప్రపంచాన్ని మెప్పించింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీనే కాకుండా హాలీవుడ్ లో కూడా ఐశ్వర్య పలు చిత్రాల్లో నటించింది. ఈ రోజుకీ ఆమె అందానికి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 17 ఏళ్ల వయసులో ర్యాంపుపై తన తొలి నడకలు మొదలుపెట్టిన ఐశ్వర్య.. 1994లో మిస్ ఇండియా కాంపిటీషన్లో ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. అయితే అదే సంవత్సరం మిస్ వాల్డ్ గా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరచింది.


ఆమె నటించిన మొదటి రెండు చిత్రాలు ఊహించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. అయితే శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆమె మూడో చిత్రం జీన్స్ తో ఐశ్వరరాయ్ తన ఫస్ట్ సక్సెస్ అందుకుంది. అలా మొదటినుంచి అపజయాన్ని తొలి మెట్టుగా మలచుకొని సక్సెస్ అందుకోవడం ఐశ్వర్యకు అలవాటుగా మారింది. ఐశ్వరరాయ్ తెలుగులో చాలావరకు తమిళ్ డబ్బింగ్ చిత్రాలలోనే కనిపించింది. అయితే ఆమె చేసిన ఒకే ఒక స్ట్రైట్ తెలుగు మూవీ నాగార్జున రావోయి చందమామ . ఇందులో నాగార్జునతో కలిసి ఒక సాంగ్ కి ఐశ్వర్య డాన్స్ వేసింది.

1973 నవంబర్ 1 ఐశ్వర్య కర్ణాటకలోని మంగళూర లో జన్మించింది. అంటే ఈ సంవత్సరం నవంబర్ 1కి ఐశ్వర్యకు అక్షరాల 50 సంవత్సరాలు వస్తాయి. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజం.. ఏజింగ్ లైక్ ఫైన్ వైన్ అనే ఇంగ్లీషు సామెత ఐశ్వర్యకి కరెక్ట్ గా సెట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎవరికన్నా వయసు పెరుగుతుంటే అందం తగ్గుతుంది. కానీ ఐశ్వర్య విషయంలో అది రివర్స్లో జరుగుతుందేమో అనే అంతగా రోజురోజుకి ఆమె అందం పెరుగుతుంది. కేవలం అందమే కాదు అభినయంలో కూడా ఐశ్వర్య దిట్ట.. అందుకే ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. 2009లో ఐశ్వర్య భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. 2007లో ఆమె బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్ అచ్చం తల్లి లాగే ఎంతో అందంగా ఉంటుంది.

హీరోయిన్ లు ఎందరో ఉండొచ్చు కానీ ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి.. ఆ పాత్రకే అందం తెచ్చే అభినయం కలిగిన హీరోయిన్ లను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. అలా అందం, అభినయం, రాజసం.. ఇలా కవి వర్ణన నుంచి జారు వాలిన ఒక అప్సరసకు ఉండవలసిన అన్ని లక్షణాలు పునికి పుచ్చుకున్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ కు బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Big Stories

×