E-Paper
Advertisement

Sankashti Chaturthi :ఏడు రోజుల్లో మీకోరిక నెరవేరాలంటే…

Sankashti Chaturthi :ఏడు రోజుల్లో మీకోరిక నెరవేరాలంటే…
Advertisement

Sankashti Chaturthi:సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది . విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చతుర్థి.. సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది . ఏడో రోజుల్లో మీ కోరిక నెరవేర్చే రోజు అంగారక సంకష్టహర చతుర్థి పూజ. ప్రతీ నెలలో బహుళ పక్షంలో సంకష్ట హర చతుర్థి వస్తుంది . అయితే సంకష్ట హర చతుర్థి మంగళవారం వచ్చే దానిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు.

విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చతుర్థి.. ప్రతిమాసం కృష్ణ పక్షంలో.. అంటే పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అంగారక సంకష్టహర చతుర్థి రోజు అర్క గణపతి పూజ చేస్తే మీ కోరిక ఏడు రోజుల్లోనే నెరవేరుతుంది. అంటే శ్వేతార్క గణపతి పూజనే అర్క గణపతి పూజ అంటారు. ఈ చతుర్థి నాడు తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి పూజను ఆచరించాలి. మంగళవారం సంకష్ట హర చతుర్థి వచ్చింది కాబట్టి ఇవాళ మీరు బియ్యం మీద
అష్టదళపద్మ ముగ్గు వేసి పక్కన స్వస్తిక్ గుర్తు వేయాలి. దాని మీద ఎరుపురంగు వస్త్రాన్ని పరిచి 21 జిల్లేడు ఆకులను పక్క పక్కనే తాకుతూ ఉండేలా పెట్టాలి. వాటి మధ్యలో శ్వేతార్క గణపతి రూపును ఉంచి 21 చోట్ల గంధం బొట్లు పెట్టాలి. 21 జిల్లేడు పువ్వులతో దండ తయారు చేసి స్వామి వారికి సమర్పించాలి.

Advertisement

తర్వాత శ్వేతార్క గణపతి మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ జిల్లేడుపూలు,గరిక, ఎర్ర పువ్వులతో స్వామి వారికి పూజ చేయాలి. ఉండాళ్లు లేదా బెల్లం ముక్క స్వామి వారికి ప్రసాదంగా పెట్టాలి. సాయంత్రం పాలతో పాయసం చేసి చంద్రుడికి నివేదన చేసి తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. ఈ పూజను సాయంత్రం పూట మాత్రమే చేయాలి. అలాచేస్తే మీ కోరిక 7 రోజుల్లో నెరవేరుతుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×