BigTV English

Golden Globe : RRRకు ప్రపంచ కీర్తి.. నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు..

Golden Globe : RRRకు ప్రపంచ కీర్తి.. నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు..

Golden Globe : RRR సినిమా కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ వేదికపై మరోసారి సత్తా చాటింది. మరో విశిష్ఠ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డును ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ఈ పురస్కారం వరించింది.


కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్‌ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి, చరణ్‌, ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు. ‘నాటు నాటు’కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్‌, రాజమౌళి, చరణ్‌.. చప్పట్లు కొడుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్ వైరల్ గా మారాయి.

కీరవాణి స్పందన ఇదే..
‘‘గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందించిన హెచ్‌ఎఫ్‌పీఏకు ధన్యవాదాలు. సంతోష సమయాన్ని నా సతీమణితో పంచుకోవడం ఆనందంగా ఉంది. నా సోదరుడు రాజమౌళికి ఈ అవార్డు దక్కాలి. పాటలో భాగస్వామ్యమైన రాహుల్‌ సిప్లిగంజ్‌ కు ధన్యవాదాలు. నా శ్రమను, నాకు మద్దతు ఇచ్చిన వారిని నమ్ముకున్నాను. ఈ పాట విషయంలో నా కుమారుడు కాలభైరవ అద్భుత సహకారం అందించాడు’’ అని కీరవాణి పేర్కొన్నారు.


ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజులను ఉద్దేశిస్తూ కల్పిత కథగా రూపుదిద్దుకుంది. యాక్షన్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది మార్చిలో విడుదలైంది. RRR ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా సందడి చేసింది. భారత్ లోనే కాక అనేక దేశాల్లో ఈ సినిమాను ఆదరించారు. RRR మూవీకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. విదేశీయులను ఉర్రూతలూగించింది. ఈ పాటను చంద్రబోస్‌ రాయగా.. ప్రేమ్‌ రక్షిత్‌ కొరియోగ్రఫీ అందించారు. ఈ సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్ పాడారు.

ఆస్కార్ రేసులోనూ RRR ఉంది. ఈ రేసులో 4 భారతీయ సినిమాలకు స్థానం దక్కింది. ఆస్కార్ అకాడమీ ప్రకటించిన రిమైండర్ లిస్ట్ లో RRR, గంగూభాయ్, ది కశ్మీర్ ఫైల్స్, కాంతారా సినిమాలకు చోటు దక్కింది.

RRRకు ఇప్చటికే అనేక అవార్డులు వచ్చాయి. ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకమైన న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డును దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల అందుకున్నారు. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో RRR చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×