E-Paper
Advertisement

Saturday sentiment in Kondagattu? :-కొండగట్టులో శనివారం సెంటిమెంట్ ఎందుకు

Saturday sentiment in Kondagattu? :-కొండగట్టులో శనివారం సెంటిమెంట్ ఎందుకు
Advertisement

Saturday sentiment in Kondagattu:- కొండగట్టు అంజన్నది విభిన్న రూపం. నారసింహుడి ముఖం ఒకవైపు మరోవైపు ఆంజనేయుడి ముఖాలతో విగ్రహం ఉంటుంది. ఆంజనేయస్వామి ఇక్కడ స్వయంభువుగా పేర్కొంటారు. ఛాతి మీద సీతారాముల విగ్రహాలు ఉంటాయి. దగ్గర్లోని సీతమ్మ బావిలోని నీళ్లతో రోజూ స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడి ఆనవాయితీ.

కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడని తెలంగాణ వాసులు నమ్ముతారు. ముఖ్యంగా సంతానం లేనివారు ఇక్కడ పూజలు చేస్తే ఫలితం ఉంటుందని చెబుతారు. అందువల్లే మంగళ, శనివారాల్లో ఎక్కువ సంఖ్యలో కి భక్తులు వస్తుంటారు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వస్తుంటారు.

Advertisement

సుమారు 500 ఏళ్ల క్రితం కొడిమ్యాల పరాగణాలో నివసించే సింగం సంజీవుడు అనే పశువుల కాపరి కొండగట్టు గుట్టలో పశువులను మేపుతుండగా ఓ ఆవు తప్పిపోయింది. దాన్ని వెతికి వెతికి విసిగిపోయిన సంజీవుడు చెట్టుకింద సేదతీరుతూ నిద్రలోకి జారుకోగా ఆంజనేయస్వామి కలలోకి వచ్చి కోరంద పొదల్లో వెలసిన తనకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించాలని సూచించి ఆవు జాడ చెప్పాడట. మెలకువ వచ్చాక సంజీవుడికి అక్కడి పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట. దాంతో, అతను కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడట.

ఏటా ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా నెల రోజుల పాటు తిరుప్పావై, గోదారంగ నాయకుల కళ్యాణం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×