BigTV English

Shaakuntalam: చాలా క‌ష్టాలు అనుభ‌వించాను.. స్టేజ్‌పై క‌న్నీళ్లు పెట్టుకున్న స‌మంత‌

Shaakuntalam: చాలా క‌ష్టాలు అనుభ‌వించాను.. స్టేజ్‌పై క‌న్నీళ్లు పెట్టుకున్న స‌మంత‌

Shaakuntalam:- స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘శాకుంతలం’. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 17న వ‌ర‌ల్డ్ వైడ్‌గా విడుద‌ల‌కు స‌న్నద్ధ‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. గుణ శేఖ‌ర్ విజువ‌ల్ వండ‌ర్‌గా శాకుంత‌లం సినిమాను తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. మియో సైటిస్‌తో సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చిన స‌మంత చాలా రోజుల త‌ర్వాత మీడియా ముందు వ‌చ్చింది. ఆమె గురించి గుణ‌శేఖ‌ర్ మాట్లాడే సమ‌యంలో ఏకంగా క‌న్నీళ్లు పెట్టేసుకుంది. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ స‌మంత మాట్లాడుతూ ఏమ‌న్నారో తెలుసా..


‘‘ఈ క్ష‌ణం కోస‌మే నేను, మా శాకుంత‌లం టీమ్ ఎదురు చూస్తున్నాం. ఎలాగైనా ఇక్క‌డ‌కు రావాల‌ని ఫిక్స్ అయిపోయి బ‌లం తెచ్చుకుని వ‌చ్చాను. గుణ శేఖ‌ర్‌గారిపై ఉన్న రెస్పెక్ట్, అభిమానం వ‌ల్ల వ‌చ్చాను. ఆయ‌న‌కు సినిమానే జీవితం. ప్ర‌తి సినిమాను ప్రాణం పెట్టి తీస్తారు. ఈ సినిమాను కూడా అలాగే తీశారు. నెరేష‌న్ విన్న‌ప్పుడూ యాక్ట‌ర్స్ అంద‌రూ సినిమా అలాగే రావాల‌ని కోరుకుంటారు. కొన్నిసార్లు మాత్ర‌మే మా ఊహ‌ను దాటి ఎక్స్‌ట్రా మ్యాజిక్ జ‌రుగుతుంది. సినిమా చూసిన త‌ర్వాత నేను చూసిన త‌ర్వాత నేను అదే ఫీల్ అయ్యాను. నేను ఊహించిన దాని కంటే సినిమా ఎన్నో రెట్లు బావుంది. చూడ‌గానే గుణ శేఖ‌ర్‌గారి పాదాల‌పై ప‌డి థాంక్యూ చెప్పాను. దిల్ రాజుగారికి థాంక్యూ. శాకుంత‌లం అనే మ్యాజిక‌ల్ వరల్డ్‌ను క్రియేట్ చేయాలంటే ఏ లిమిట్‌, క్యాలిక్యులేష‌న్స్ లేకుండా న‌మ్మ‌కంతో చేయాలి. అలాంటి ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌ని దిల్‌రాజుగారి రూపంలో చూశాను. మంచి సినిమా తీయాల‌నే ఆయ‌న చూస్తారు. ఈ సినిమాలో చాలా మంది సీనియ‌ర్ న‌టీన‌టులున్నారు.

నేను సెట్స్‌లోకి రెడీ అయ్యి అడుగు పెట్టిన త‌ర్వాత అక్క‌డున్న అమ్మాయిల రియాక్ష‌న్ చూసి ప‌ర్ఫెక్ట్ దుష్యంతుడు దొరికాడ‌ని ఫిక్స్ అయ్యాను. కాళిదాసుగారు 5వ శ‌తాబ్దంలో రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగాచేస్తోన్న శాకుంత‌లం సినిమా కోసం న‌న్ను గుణ శేఖర్‌గారు ఎంపిక చేయ‌టం నా అదృష్టం. నేను జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాను. అయితే మారన‌ది ఒక‌టే ఉంది. అదే సినిమాను నేను ఎంత ప్రేమిస్తాను.. సినిమా న‌న్ను ఎంత ప్రేమిస్తుంద‌నే విష‌యం. శాకుంత‌లంతో ఈ ప్రేమ మ‌రింత పెరుగుతుంద‌ని న‌మ్ముతున్నాను’’ అన్నారు సమంత.


అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగా రూపొందుతోన్నశాకుంతలం సినిమా క‌థ‌ను సిద్ధం చేసి గుణ శేఖ‌ర్ మూవీని తెర‌కెక్కించారు. ప్ర‌తీ ఫ్రేమ్‌ను అంద‌మైన పెయింటింగ్‌లా సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు గుణ శేఖ‌ర్‌.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×