E-Paper
Advertisement

Saturn Retrograde: నవంబర్ 15న కుంభ రాశిలోకి శని ప్రవేశం.. 4 రాశుల వారిపై సంపద వర్షం

Saturn Retrograde: నవంబర్ 15న కుంభ రాశిలోకి శని ప్రవేశం.. 4 రాశుల వారిపై సంపద వర్షం
Advertisement

Saturn Retrograde: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని కర్మ ఫలితాలకు కారకుడిగా చెబుతారు. శని కోపం వల్ల రాజు కూడా పేదవాడిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని అంటారు. అందుకే ప్రతి ఒక్కరు శని ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలని కోరుకుంటారు.దీపావళి పండుగ దగ్గర పడుతోంది. ఇది జరిగిన కొద్ది రోజులకే నవంబర్ 15, 2024 నాడు, శనినేరుగా కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. కుంభ రాశిలో శని సంచారం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ఇందులో ముఖ్యంగా 4 రాశుల వారికి శని సంచారం వల్ల అదృష్టం పెరుగుతుంది.

మేష రాశి: శని కుంభ రాశిలో సంచరించడం వల్ల మేష రాశి వారికి కెరీర్‌లో విజయం చేకూరుతుంది. మీరు ఆఫీసుల్లో బలమైన పట్టును కలిగి ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు రెట్టింపు లాభాలు పొందగలుగుతారు. ఖర్చులు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా ఆదాయాలు పెరుగుతాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది.

Advertisement

మిథున రాశి:

శని ప్రత్యక్ష సంచారం వల్ల మిథున రాశి వారి జీవితంలో మంచి ఫలితాలను చూస్తారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా శరీరం శక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో మీరు పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది. అంతే కాకుండా ఉద్యోగ మారాలని అనుకునే వారికి ఇది మంచి సమయం. మీరు చేయాలని అనుకున్న పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీ వైవాహిక సంబంధం కూడా మెరుగ్గా ఉంటుంది. పని చేసే చోట అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగులకు ఇది మంచి సమయం.

Advertisement

కన్య రాశి:

కన్య రాశి వారికి కుంభరాశిలో శని ప్రత్యక్షంగా ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో వ్యాపార వ్యక్తులు అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ విజయం సాధిస్తారు. ఆర్థిక జీవితంలో బలం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఉత్తేజకరమైన ప్రయాణానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. అందుకే ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరు దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తీసుకోండిజ

Also Read: లక్ష్మీదేవి మంత్రం జపిస్తే మీ జీవితాన్ని సమృద్ధిగా డబ్బుతో నింపుతుంది

ధనుస్సు రాశి :

శని అనుగ్రహంతో ధనుస్సు రాశి వారు తమ జీవితంలో శుభ ఫలితాలను చూస్తారు. కొత్త పనిని విజయవంతంగా ప్రారంభించగలుగుతారు. మీరు కార్యాలయంలో సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా శుభమే కలుగుతుంది. అంతే కాకుండా ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనం ఆదా అవుతుంది. అంతే కాకుండా మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. పెండింగ్ పనులను ఈ సమయంలో పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×