BigTV English

Nithiin New Movie : చేతులెత్తిసిన నిర్మాత… నితిన్ మూవీకి కొత్త ప్రొడ్యూసర్..?

Nithiin New Movie : చేతులెత్తిసిన నిర్మాత… నితిన్ మూవీకి కొత్త ప్రొడ్యూసర్..?

Nithiin New Movie : హీరో నితిన్… 12 ఏళ్ల క్రితం నితిన్ ను ఓ హీరోగా కూడా లెక్కచేయలేదు. ఎన్ని సినిమాలు చేసినా… ఒకటి అంటే ఒక్క హిట్ కూడా రాలేదు. వరుసగా 12 డిజాస్టర్లు వచ్చాయి. ప్రొడ్యూసర్ కొడుకు కాబట్టే… ఇంకా సినిమాలు చేయగలుకుతున్నాడు అంటూ అప్పట్లోనే చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. అలాంటి నితిన్ కి 2012లో ఓ మూవీ వచ్చింది. అదే ఇష్క్. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ నితిన్ కెరీర్‌నే మొత్తం తిప్పేసింది. ఇప్పుడు మళ్లీ నితిన్‌కు వరుస ప్లాప్స్ వస్తున్నాయి…


ఈ ప్లాప్స్ ను మళ్లీ గట్టెక్కించేందుకు మళ్లీ వస్తున్నాడు విక్రమ్ కే కుమార్. 12 ఏళ్ల తర్వాత విక్రమ్ కే కుమార్ – నితిన్ మళ్లీ కలిసి సినిమా చేస్తున్నారు. దీనిపై ఈ మధ్య తెగ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది. నిజానికి దసరా కానుకగా ఈ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. కానీ, రాలేదు. అయితే అతి త్వరలోనే రావొచ్చు అనేది ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్.

ఆలస్యానికి కారణం నిర్మాతే…


దసరా సందర్భంగా ఈ మూవీ అనౌన్స్‌మెంట్ చేయాలని మేకర్స్ ముందుగా అనుకున్నారట. కానీ, ఈ సినిమా చర్చలు జరిగే టైంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించడానికి రెడీ అయ్యారట. కానీ, సడన్ గా ఆయన తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. హనుమాన్ తర్వాత నిరంజన్ రెడ్డి పట్టుకున్న ప్రతీ మూవీలో నష్టాలే చూశాడు. డార్లింగ్ అనే మూవీని స్వయంగా నిర్మించాడు. అలాగే డబుల్ ఇస్మార్ట్ మూవీ నైజం రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసి దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు నష్ట పోయాడని టాక్.

ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌తో ఆయన SDT18 అనే మూవీ చేస్తున్నాడు. దీనికి దాదాపుగా 120 కోట్లపైగా బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ మూవీతో పాటు మరో మూవీ అంటే కష్టమని, నిరంజన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. అతని ప్లేస్‌లో సుధాకర్ చేరుకురి నిర్మాతగా చేరాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అంతా సెట్ అయ్యాకా… త్వరలోనే సుధాకర్ చేరుకురి నిర్మాతగా నితిన్ – విక్రమ్ కె కుమార్ మూవీ అనౌన్స్ రాబోతుందని తెలుస్తుంది.

నితిన్ బ్యాక్ టూ బ్యాక్…

యంగ్ హీరో నితిన్‌కు మళ్లీ వరుస ప్లాప్స్ పడుతున్నాయి. ఈ ప్లాప్స్ నుంచి తప్పించుకోవడానికి నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తమ్ముడు, రాబిన్ హుడ్ అనే సినిమాలు అనౌన్స్ చేశాడు. వాటి షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ఇప్పుడు విక్రమ్ కే కుమార్ తో మరో మూవీ చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రావొచ్చు. అలాగే బలగం వేణు రెడీ చేసుకున్న ఎల్లమ్మ మూవీ స్క్రిప్ట్ ఫైనల్ గా నితిన్ దగ్గరకు వచ్చి ఆగిందట. నాని, తేజా సజ్జ లాంటి హీరోలు ఈ ఎల్లమ్మ మూవీని రిజెక్ట్ చేశారట. ఫైనల్ గా కొన్ని మార్పులతో నితిన్ ఒకే చేశాడని సమాచారం. దీనిపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా, ఎల్లమ్మ మూవీ రెగ్యూలర్క షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్టార్ట్ కాబోతుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×