E-Paper
Advertisement

Shani Retrograde 2024: ఈ రాత్రి నుంచి ఈ రాశుల వారికి డబ్బే-డబ్బు.. జీవితంలో సంతోషం, సమస్యలు దూరం!

Shani Retrograde 2024: ఈ రాత్రి నుంచి ఈ రాశుల వారికి డబ్బే-డబ్బు.. జీవితంలో సంతోషం, సమస్యలు దూరం!
Advertisement

Shani vakri 2024 on june 29 Today These Zodiac Sign People Financial Gain Will Increase:
గ్రహాల్లో మార్పులు జరిగినప్పుడే వివిధ రాశులపై పడే ప్రభావాన్ని జ్యోతిష్యులు నిపుణులు అంచనా వేస్తారు. అయితే ప్రస్తుతం కుంభరాశిలోనికి శనిదేవుడు ప్రవేశించబోతున్నాడు. ఈ రాశుల వారికి జీవితాలపై ప్రతికూల, సానుకూల ప్రభావాలు ఉంటాయి. శని అనగానే ప్రతి ఒక్కరు కంగారుపడుతూ ఉంటారు. అంటే.. శని అంటే మనకేదో చెడు జరగబోతోందో అని లేకపోతే ఎలాంటి ఫలితాలు ఎదుర్కొవలసి వస్తుందనో ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు.

శని అంటే మనకు చెడు మాత్రమే కాదు, అదృష్టం కూడా ఒక్కొక్కసారి వస్తుంది. జూన్ 29 శనివారం.. అంటే ఈ రాత్రి కుంభరాశిలోకి శని దేవుడు ప్రవేశించబోతున్నాడు కాబట్టి ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతోంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే ఈ రాశుల వారు ఎవరు? అసలు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలపై తెలుసుకుందాం..

Advertisement

మేషరాశి

జ్యోతిష్యం ప్రకారం.. మేషరాశి వారికి శని ప్రభావం వలన ఈ సంవత్సరం బాగానే ఉండబోతుందని చెప్పాలి. సకాలంలో డబ్బు చేతికందుతుంది. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. ఆర్ధిక రంగంలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇన్ని రోజులు ఉద్యోగం లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారకి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు.

Advertisement

వృషభ రాశి

వృషభ రాశి వారికి శని ప్రభావం వలన చాలా అద్బుతంగా ఉండబోతోంది. డబ్బు అనేది విపరీతంగా సంపాదిస్తారు. ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న వారు మంచి విజయం సాధిస్తారు. వీరు కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా ఉంటారు. వ్యాపారం రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ రాశుల వారికి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. సొసైటీలో మంచి గుర్తింపు ఉంటుంది.

కుంభరాశి

ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్దిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్ధులకు, మహిళలకు, ఉద్యోగం చేస్తున్న వారు, ప్రతి ఒక్కరికి కూడా ఇది సరైన కాలం అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి వారికి డబ్బు విపరీతంగా రాబోతుంది. ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×