E-Paper
Advertisement

Shiva Lingam:- ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగం ఎక్కడ ఉంది…

Shiva Lingam:- ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగం ఎక్కడ ఉంది…
Advertisement

Shiva Lingam:- ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఆలయం ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. . ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రాన్ని కంటే మిన్నగా లింగ రూపంలో కొలువైన వాయులింగేశ్వరుడు అత్యంత మహిమాన్వితుడిగా భావిస్తారు. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు.

ఈ శివ లింగాన్ని ప్రాణం ఉన్న భక్తులు విశ్వసిస్తారు. ఇలా నమ్మడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని విశ్వాసిస్తుంటారు.

Advertisement

అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అభిషేకాలు చేసినా ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు. ప్రాణ వాయులింగంగా పూజాలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరున్ని కర్పూర లింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజూ పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు.కాశీ విశ్వేశ్వరుడ్ని చేతులుతో తాకడానికి అనుమతి ఇస్తారు. కానీ వాయులింగేశ్వరుడ్ని కనీసం ముట్టకోనీయరు. పూజారులకి సైతం ఈ నిబంధన వర్తిస్తుంది. అదే ఈ వాయు లింగేశ్వరుడికి ప్రత్యేకత.
శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు మీ జీవుల భక్తిని మెచ్చి లింగేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించిన ప్రాంతమంది. అందుకే శ్రీకాళహస్తి అయింది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×