E-Paper
Advertisement

Horse’s girdle :- గుర్రం నాడా గుమ్మానికి కట్టాలా….

Horse’s girdle :- గుర్రం నాడా గుమ్మానికి కట్టాలా….
Advertisement

Horse’s girdle:- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇంటి ప్రధాన ద్వారం మీద గుర్రపు నాడాను వేలాడదీయడం వల్ల ఇంట్లో శుభం కలుగుతుంది. ఇనుము శనిదేవునికి ఇష్టమైన లోహం. ఇంట్లో శని బాధలు తొలగిపోవాలంటే గుమ్మానికి ఇనుమ లోహాన్ని వేలాడదీస్తే మంచిది. అందులోనూ గుర్రానికి చెందిన నాడాను వేలాడదీస్తే మరింత మంచి జరుగుతుందని జోతిష్య శాస్త్రం చెబుతోంది. గుర్రపు నాడా అంటే గుర్రం యొక్క కాళ్లకి తొడిగే ఇనుముతో చేయబడిన చెప్పు లాంటి పరికరం. కొన్నిరోజులు వాడిన తరువాత వాటిని గుర్రపు కాలి నుండి తొలగిస్తారు. అలా తొలగించబడిన నాడాను ఎన్నో జ్యోతిష్య పరిహారాలకు ఉపయోగిస్తారు. నల్లగుర్రానికి కొట్టబడిన వెనకనున్న ఎడమకాలి నాడాని మాత్రమే దీనికి పనికి వస్తుంది. . గుర్రానికి కొట్టకుండా ఉన్న నాడాని ఉపయోగించిన ఎటువంటి ఫలితము ఉండదు. గుర్రపు నాడాని శనివారంగాని , శని త్రయోదశినాడు గాని సేకరించి గుర్రపునాడాకి సింధూరం పూసి ఉంచాలి.సింధూరంతో పూసిన గుర్రపునాడాని శనివారం ఉదయం ఓం ఐం హ్రీం శ్రీం శనైశ్చరాయ నమః మంత్రం జపించి ఇల్లు లేదా ఆఫీసు లేదా ఫ్యాక్టరీ యొక్క ప్రధాన ద్వారానికి ఎడమవైపున ఉంచాలి.

ఇంటికి సంబంధించినంత వరకు గుర్రపునాడాని A ఆకారంలో ఉంచాలి . దీనివల్ల శనిదోషం , నరదృష్టి ప్రభావాలు తుప్పురూపంలో కిందకి అణిగిపోతాయి. గుర్రపునాడాని వ్యాపార స్థలంలోగాని , ఫ్యాక్టరీ ప్రధాన ద్వారానికి ఎడమవైపున యు ఆకారంలో ఉంచాలి . ఇలా ఉంచడం వల్ల ఇంటికిగాని , ఆఫీసుకిగాని శత్రుబాధలు , దృష్టిదోషాలు దరిచేరనివ్వదు.. కొన్నిసార్లు గుర్రపు నాడాతో తయారు చేసిన ఉంగరాలను చేతికి ఉన్న మధ్య వేలికి ధరించడమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల చేసే చేపట్టబోయే ప్రతి పనిలో విజయం చేకూరుతుందని నమ్మకం. ముఖ్యంగా ప్రతిరోజూ ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు ద్వారం పై గల ఈ గుర్రపు నాడా కి నమస్కరించి వెళ్ళితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

Advertisement

Follow this link for more Updates:- Bigtv

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×